పునర్నిర్మాణం?!?!//శ్రీనివాస్//04/03/2014 ----------------------------------------------- కుట్టుకుంటూ కూర్చున్నావా చిరిగిన బొంతని తీరిగ్గా పేర్చుకుంటూ చీలకలూ పేలికలూ సూదేమో దిగదాయే దారపు చిక్కులు విడవాయె చీకటి తో నీ దోస్తీ తెగదాయే నడి రేయికి నవ్వులేదు జడివానకు మెరుపు లేదు తగదంటే వినకుండా వర్షించే కన్నుల్లో తడి బారిన గుండెల్లో వెన్నెలని వెదుక్కుంటూ వేసారిన మనసుకు విశ్రాంతే కరువాయె బ్రతుకంతా బరువాయె మేటింగ్లో ఫైటింగే పార్టింగ్లో ఫైటింగే మీటింగ్ పాయింటే లేని మనసులకు పీసంటే పీస్ పీసే పుట్టుంటే బాగుండే గిట్టున్నా బాగుండే పుట్టీ పుట్టని పుట్టుక పుట్టాకీ వగపేలో నూతుల్లో నీరు రాక జనవాసాలల్లో వద్దంటే పారాకా తెలిసి తెలిసీ చేసిన తప్పుల వుచ్చులు మెడ చుట్టూ బిగిసాకా నటనేలో వగపేలో వగపుల నటనేలో నటనల్లో వగపేలో వుచితంగా వెలిగే దివిటీలకు చమురు లేక నీరందిచ్చే శక్తి లేక అరువిచ్చే బుగత లేక పండని బీడులు వేసే ప్రశ్నలకి జవాబీయలేక మండే గుండెలకింత వుపశమనం కరువయ్యాక నువ్వు నాటిన గులాబి మొక్క వాడాకా నువ్వు వోడాకా వగపేలో, నటనేలో పేర్చుకున్న చితిలోనే మోక్షం పొందేసేయ్ పోసుకున్న పెగ్గులో కీర్తి నిషా తలకెక్కి జీవన్ముక్తికి సోపానం వేస్తుందిలే అరువు సోకుల ధగధగలన్నీ వెలిసిపోతే కాల గర్భంలో కలిసిపోతే నువ్వొక్కడివే కీర్తి నిషాలో తీరిగ్గా మునిగిపో మురికి పాలైన మమ్మల్ని యిట్లానే వదిలేసిపో
by Maddali Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djCmGq
Posted by Katta
by Maddali Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djCmGq
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి