పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నన్ను నేను మరచి నీ ద్యానంలో మరణిస్తా || ------------------------------------------------------------------- చెలి చెమ్మ గిల్లిన కళ్ళతో చేదు అనుభవాలతో చావుకు చేరువలో ఉన్న చరిత్ర లేని శవాంగా మిగిలాను నేను నీ కోసం నిరీక్షిస్తూ నీవు నాదానివి కావాలని ఆకాంక్షిస్తూ చెదిరిన కలల్ని నెమరువేస్తూ శూన్యం లోకి వంటరినై చూస్తూ నీకోసం కలల పొలంలో భ్రమలనే విత్తనాలను నాటాను నేను కన్నీటి కలువ ప్రక్కన శూన్య ఫలసాయం వస్తుందని తెల్సీ ఇంకా ఆశతో ఎదురు చూసే వ్యర్థ జీవి నేను ఇలా గడిచే కలల కాలంలో కరిగి పోతున్నా నని తెల్సి కాలం నన్ను వెక్కిరిస్తున్నా విదిలేని పరిస్తితుల్లో వెక్కిరిస్తున్న గతం సాక్షిగా ఓడిపోయి వాడిపొయిన మనసు నాదే కన్నా చివరకు నే చూస్తున్న శూన్యం లో కలిసిన బాధలన్ని నాలోనే దాచుకొని నన్ను నేను మరచి నీ ద్యానంలో మరణిస్తా అదే నాజీవితపు చివరి మజిలీ అని తెలిసిన క్షనాల్లో

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i7uUCz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి