పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

ఉమిత్ కిరణ్ ||వీడ్కోలు|| నీ పట్ల నా ప్రేమ మరణం లేనిది. అయినా దేశం పట్ల నన్ను యుద్దానికి పిలుస్తోంది నీతొ నేను గడిపిన మధుర క్షణాలన్ని నన్ను తరంగాలు తరంగాలుగా ముంచెత్తుతున్నాయి. అంత గొప్ప ప్రేమానుభవాన్ని పొందగలిగేలా చేసినందుకు నేను దేవుడికి ఎప్పుడూ ఋణపడి ఉంటాను.... నేను ఒకవేళ యుద్దం నుంచి రాకపోతే నా ప్రేమను విస్మరించకు.... నాఊపిరితిత్తుల నుండి ఆఖరి శ్వాస బయటి కొచ్చే సమయంలో కూడా అది నీ పేరుగా పరణామం చెందుతుంది.... మరణించిన వారి ఆత్మలు ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉంటాయన్నమాట నిజమైన పక్షంలో నేనెప్పుడూ నీదగ్గరే ఉంటాను.... ఓక చిరుగాలి నీ ముంగురలను కదల్చడానికి నిన్నుస్ర్పుశించినపుడు అది నా ఊపిరే అవుతుంది. నేను ఒకవేళ యుద్దంలో మరణిస్తే అది శాశ్వతమైన వీడ్కలుగా బావించకు. మన కలయిక కోసం నేను వేచి ఉంటాను.. అప్పుడు ఇక ఏ యుద్దమూ మన ఆత్మలని వేరు చేయలేరు కదా.....

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f2wBJD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి