అది నాదే! ఓ కవిత మట్టిలోంచి చెట్టులో చేరి ఆకుపచ్చని హస్తం చాచి నా మీద కవిత్వం రాయండి అంటుంది ఇంకో కవిత రెక్కల్లోంచి ఓ ఈకని పీకి ఆకాశంలో ముంచి తనూ రాయడానికి తయారైపోతూ తన గురించి రాయమని సవాల్ విసురుతుంది మరో కవిత తనలోని ఆశల్ని రాగాల దారాలుగా గాలినిండా అల్లి మంచు ముత్యాల్ని ఒడిసి పట్టి నా మీద కూడా కవిత రాయమంటుంది మూడు విడికవితలు కలిసి ఒకే కవిత ఇక నేనేం రాసేదీ నన్నూ చేర్చుకోమని అడగడం తప్ప నలుగురికీ కలిపి ముక్తాంపుగా ఉమ్మడిగా ..ఒకే ఒక చిరునవ్వు ఆది నాదే ----------వసీరా
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5lCWa
Posted by Katta
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5lCWa
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి