పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మార్చి 2014, శుక్రవారం

Patwardhan Mv కవిత

కవి :::::: దేశానికి ఒక జాతీయ పతాకం జాతీయ గీతం చాలు కానీ ప్రతి పౌరుడూ జాతీయ కవి కావాలి మానవ జాతీయ కవికావాలి. అవును-కవి కల గనేది ఒక నిస్స్వార్థ ప్రపంచాన్ని ప్రపంచం కలగనేదీ ఒక నిస్స్వార్థ ,,నిఖార్సైన కవిని. 21-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2XU

Posted by Katta

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. రెండవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. పడగవిప్పి లేచినట్టి నల్లతాచు జడపొగరుకు సంపెంగల వంటిముక్కు కారణమూ లాగున్నది ఆకశాన హరివల్లుకు వంపునెవరు నేర్పారో చూసిందా చక్కని నీ పెదవి విరుపు లాగున్నది మంచుపొరలొ గులాబీపై ప్రతిఫలించే లేత ఎండ చెంపలపై నర్తించే మెరుపుపూవు లాగున్నది శంఖంలో సంగీతం పలుకుతుంది ఎందుకనో పోలికలో అది కూడా నీ కంఠము లాగున్నది అందంగా వంగుతోంది సెలయేరూ నర్తకిలా నడుం వంపు నేర్పిందా ఈ నాట్యము లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2Hu

Posted by Katta

Srinivas Vasudev కవిత

నేను ఈ శీర్షికలో అనువాదాల గురించి రాయను. ఆంగ్ల కవిత్వం గురించే రాస్తాను. మన కవిమిత్రుల్లో కొంతమంది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు కానీ ఈ వింగ్డ్ వర్డ్ శీర్షికద్వారా చెప్పదల్చుకున్నది మన సాహిత్యంతో పాటు పరదేశీ సాహిత్యంలోని సుమసౌరభాల గురించే సుమా.... కానీ ఈ కవిత గురించి ఇంతకుముందే మన పాఠకులకి చెప్పాను. నాకు నచ్చిన మలయ్ కవిత ఇది. కొన్ని వాక్యాల్లోనే ఒంటరితనం గురించి ఇంత అందంగా చెప్పగలగటం నాకు తెగ నచ్చేసింది. అందుకే చాలా జాగ్రత్తగా అందర్నీ అడిగి మరీ దీన్ని అనువదించాను. తనను తాను ఓ ద్వీపకల్పుడు అని చెప్పుకోవడం ఎంత గొప్ప భావన! అలా చెప్పుకుంటూ ఒంటరితనం బాధ గురించీ గొప్ప కవితాత్మకంగా చెప్పుకొచ్చాడు ఇతను...ఇదిగొ ఇలా! చదవండీ ఈ రెండూనూ! An islander ------------- Walking along the seaside Found a loner A lone island, all alone by itself! Shockingly reminding My loneliness The beach and the island are close But far As far as me and my heart Only straits draw them apart This island and me Make one tale A sad tale of loneliness (free translation from a poem in Malay language; the original is given below) Menyelusuri sepanjang pantai Pulau pun kelihatan Terampai dan melambai Mengimbau Pantai dan pulau Berdangansanak Sejangkau Cuma selat yang memisah Menjadi sebuah kisah (Anonymous)

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKC2r1

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

కవిత్వంతో నా అనుభవం : ---------------------------- కవిత్వం వొక గొప్ప చలనభూతమైనది. మనిషిని అది అత్యంత గొప్పగా ప్రభావితం చేస్తుంది. నిర్మిస్తుంది. ప్రంపంచ దేశాలలో అన్ని కాలాలలో కవిత్వం మనిషిని తలవంచని వీరుణిగానే నిలబెట్టింది. వొకొక్కప్పుడు కవిత్వం కొందరికి చెందిన సరుకుగా చెలామణి అయినా చివరకు అది చేరాల్సిన వాళ్ల చేతుల్లోకే చేరింది. చేయాల్సిన పనినే చేస్తుంది. కవిత్వం వొక ఆయుధమైంది. గాయాన్ని మాన్పే ఔషధమైంది. తల నిమిరే జాలి చేయి అయ్యింది. కవిత్వమంటే ప్రపంచ మానవ సమూహాలపై తెరుచుకున్న చైతన్యపు కన్ను. అలాంటి కవిత్వంతో ఈ ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా నా అనుభవం మీతో పంచుకోవాలనిపించింది. నేను చదివిన తొలి కవిత్వ సంపుటి - 'మహాప్రస్థానం'. మా ఊర్లో మా ఇంటి దగ్గర బీరువా నిండా పుస్తకాలు. మార్క్సిస్ట్ మహా గ్రంధాలు. 'కార్ల్ మార్క్స్ -ఎంగెల్స్' పేర్లు అక్కడ తెలిసాయి. రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ కుప్పకూలాక - తొంబై ఒకటిలో విజయనగరం కోట దగ్గర చవగ్గా అమ్మితే నాన్న కొన్నవవి. రెండు మూడు కాగితాలు తిప్పి పెట్టేసేవాడిని. కానీ వాళ్ల గొప్పతనాన్ని నాన్న చెప్పేవారు. స్కూల్ డేస్ లో అల్లూరిని, గాంధీజీ జీవిత చరిత్రను చాలా ఇష్టంగా చదివేవాడిని. అల్లూరి పోరాటం నచ్చేది. దానిని పక్కవాడికి Explain చేసేవాడిని. వాణ్ణీ ఉద్యుక్తున్ని చేయడమే నా ఉద్దేశం. తర్వాత మార్క్స్, మావో, చేగువేరా, ఫైడల్ కాస్ట్రో, లెనిన్, స్టాలిన్ ల రచనలు చదివాను. చదువుతున్నాను. ఈ మహానుభావుల రచనలను నేనైతే మనల్ని ఊపేసే కవిత్వంగానే భావిస్తాను. వొక గొప్ప ఆలోచనను కలిగించి మనపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయవి. నాకు అత్యంత ప్రేరణ, బలం యిచ్చిన కవిత్వం కె. శివారెడ్డి గారిది. 'గగనమంతా తలతో.. ' - చదివాక నా ఆలోచనల్లో మార్పుని గుర్తించాను. చర్య, అతను చరిత్ర - కవిత్వం చదివాక పోయిట్రీ సొబగు తెలిసింది. ఆ తర్వాత.. శివసాగర్ కవిత్వం నన్ను సమ్మోహితున్ని చేసింది. అరణ్యం మీద, పోరాటాల మీద వొక రకమైన curiasity ని పెంచింది. నగ్నముని 'కొయ్యగుర్రం' చదివాక - ఆ కవిత్వ వస్తువుకు, వ్యక్తీకరణకు, కవి దృక్పథానికి గాల్లో తేలిపోయాను. హెచ్చార్కె 'వానలో కొబ్బరి చెట్టు' కవిత్వ నిర్మాణం, అందులో ఆర్థ్రత నన్ను విపరీతంగా కదిలించాయి. అఫ్సర్ 'ఊరి చివర' చదవడం - వొక అనుభవంగా మిగిలిపోయింది. యాకూబ్ 'ప్రవహించే జ్ఞాపకం'లో సున్నితత్త్వం నా కవిత్వానికీ కావాలనుకుంటాను. అలెక్స్ హెలీ 'Roots' - నవల చదివాక గుండె బిగబట్టీసింది. ఆ రోజు రాత్రంతా దుఃఖపీడనంతో ఏడ్చుకున్నాను. నా ఆలోచనను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకమది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇతర మార్క్సిస్ట్ పుస్తకాలు - ఆ కోవలో వచ్చిన అనేక వ్యాసాలలో కవిత్వాన్ని నిర్మించే గొప్ప వ్యూహముంటుంది. అవి కచ్చితంగా చదవాల్సినవి. ఇటీవల నేను చదివిన వొక అద్భుతమైన పుస్తకం- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్ గారి - 'నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా ? అయితే సంతోషం !' - .కొత్త ఆలోచనను, దృక్పథాన్ని యిచ్చింది. నెరూడా, అంద్రాదె, లాంగుస్టన్ హ్యూగ్యూస్ లాంటి వివిధ దేశాల కవులను చదవడం వలన మన ఆలోచనల్లో , కవిత్వ వస్తువుని తీసుకోవడంలో, కవిత్వ నిర్మాణ వ్యూహాలలో విస్తృతి పెరుగుతుంది. * నా పాఠశాల నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. పిల్లల్లో నుంచి Poets ని, artists ని బయటకు తీసే పనిలో వున్నాను. నాకు దొరికిన అద్భుతమైన కవిత్వపాదాలు వాళ్లు. వాళ్లతోనే నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను - వాళ్లలోనే నన్ను నేను శోధించుకుంటాను - నన్ను నేను సానబెట్టుకుంటాను. Expression is more important to poetry - నా పిల్లల మధ్య పాఠ్యాంశ విషయాలను - ప్రాపంచిక అంశాలతో, వర్తమాన సామజిక స్థితిగతులతో మిళితం చేసి , నా దేశాన్ని గురించి సైద్ధాంతిక శాస్త్రీయ అవగాహన పొందేటట్టు.. చెబుతూ - లీనం కావడం నాకు అమితమైన యిష్టం. అది నా టీచింగ్ శైలి. రానున్న కవిత్వ యాత్రలో నా కవిత్వ వ్యక్తీకరణకు పిల్లల మధ్య వుండడం అనేది - ప్రధాన కారణంగా వుంటుందని నమ్ముతున్నాను. అన్ని దేశాల ప్రజాసమూహాలను కలిపి వుంచే గొప్ప వంతెనగా వున్న కవిత్వమా... జయహో ! మామూలు మనుషులను మహా శక్తివంతులుగా తీర్చిదిద్దే కవిత్వమా జయహో ! కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రగా మిగిలిపోతుంది. -------------------------- 21 మార్చి 2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X7Lz

Posted by Katta

Chandu Ch Smile కవిత

ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.... మిత్రులందరికీ :) కాస్తంత ఆలస్యంగాచెపుతున్నాను అని ఏమనుకోకండే..... :) మనిషి కవిగా మారాలన్నా.... ఒక కవిత రాయాలన్నా..... తనకు రాయాలనుకున్న దానిమీద ఒక అవగాహన... ఖచ్చితంగా అవససరం..... కంటికి కానరాని ప్రపంచాన్ని.... కళ్ళ ముందు ఆవిష్కరించేది కవిత.... తన కనులముందు కదలాడే దృశ్యాన్ని... కళ్ళకు కట్టినట్టు...వర్ణించిచెప్పేదే కవిత..... యదార్థతను నెరిగి సమాజంలో్ జరిగే ప్రతీ ఘటనని ఆ సంఘటనని... అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేదే కవిత.... మనసులో ఎక్కడో మరుగున పడి ఉన్న.... భావనలకు అక్షర రూపం పోసి... అందరితో పంచుకోగలిగేదే కవిత...... అక్షరాలని అస్త్రాలుగా మరల్చి..... నిద్దురపోతున్న సమాజాన్ని.... మరుగున పడుతున్న మానవత్వాన్ని జాగృతం చేసేదే కవిత...... అందకారంలో ఉన్న మానవ సమాజాన్ని... ఉవ్వేత్తున ఎగసిపడే అలలా ప్రభావితం చేసేదే కవిత..... ఇలా కవితలు...వాటిని వ్రాసే కవులు.... మన నిజ జీవితంలో భాగమైపోయారు... కవితలు... మన మానవ సమాజానికి... చాలా ఉపయోగకరంగా నిలుస్తున్నాయి.... కవితను వర్ణిచటం అనేది మాత్రం.... ఒక్క కవి పైన మాత్రమే ఆదారపడి ఉంటుంది.... ఎవరి వర్ణనా శైలి....వారిది.... ఎవరి అనుభవం...వారిది.... అక్షరాలను వాటి యొక్క అర్థాన్ని... వాటిని బట్టి ప్రయోగించే పదాలు కూడా అనేకం... ఈ రకంగా...కవులు...తమ తమ... ప్రతిభను, అనుభవాన్ని, అక్షరాలలో ప్రదర్శించి వారి భావాలను తెలియజేస్తారు..... ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు... అలాగే.. ఎందరో కవి హృదయులు...పేరు పేరునా అందరికీ వందనాలు... కవిత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చిరు అక్షర సమూహంగా మలిచి.... మీ అందరి ముందు ప్రదర్శిస్తున్నాను.... తప్పులు ఉంటే మన్నించగలరు.... ఇట్లు మీ చిరునవ్వు....! :)

by Chandu Ch Smile



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWFt9o

Posted by Katta

Udaya Babu Kottapalli కవిత

నిండు చంద్రునికి ఒక నూలుపోగు కొత్తపల్లి ఉదయబాబు : 21-3-2014 అమ్మా..! .నాన్న ఏడని అడిగిన ప్రతీ బిడ్డ ప్రశ్నకు... సమధానం గా ఆమె చూపుడు వేలు చివర నిలబడ్డ ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం...నాన్న... విత్తిన ప్రతివిత్తు...చిగురుపిట్టై మొలకెత్తాలని మొక్కై ఒడుదుడుకులనెదుర్కొని ఎదిగి వటవృక్షమై నిలవాలని సేద్యం చేసే నాన్న ఆశ...! అమ్మ క్రమశిక్షణా శిబిరంలో నాన్న ఒక దండనాయుధం... నిత్య సంసార సమరంలో అమ్మచాటు అందరికి నాన్న ఒక ఛత్రం..... గడియారపు ముల్లును ఓడించే నాన్న వౄత్తిధర్మం ముందు అధర్మం ఎప్పుడూ అవిటిదే.... పాతికేళ్ళ జీవితాన్ని సమాజంలో సగౌరవపు స్థానంలో నిలబెట్టిన పెంపకానికి మూల ధనం నాన్న... వెన్ను ఇంద్రధనుస్సై జీవితాన్ని మూడోకాలు నడిపిస్తున్నప్పుడు... ఎడమ భుజమై బిడ్డకు తోడై నిలబడే నాన్నను చూసి ప్రతీ కుటుంబపు పతాకం " జై "కొట్టాల్సిందే... ప్రతీ బిడ్డ ఆరూపానికి సాష్టాంగపడాల్సిందే...!!! ********************* ::: ********************

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X8ix

Posted by Katta

Ravi Rangarao కవిత



by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X56t

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ శ్రామిక చినుకులు @ నున్నటి చిగురుటాకులపై సన్నగా కురిసి నునువెచ్చని సూర్యరశ్మికి జాలువారుతున్న మ౦చు తు౦పర్ల నీటి చుక్కలు కావవి దినదిన౦ బతుకుతో ఆకలి పొరాట౦ చేస్తూ ... ఎర్రటె౦డకు చెమట చుక్కల్ని తూర్పార బడుతూ కూలిబిడ్డలు రక్త౦ కరిగి౦చి రాల్చిన స్వేదబి౦దువులవి. ఆ శ్రమజీవులు ఆర్తితో అవనిపై రాల్చిన శ్రామిక చినుకులవి. వారి బతుకు వారికి బారమై రె౦డు చెతుల్లొ దరనిని మోసే శక్తివ౦తుల చెమట తడులవి. ఆ జీవన౦ మోడువారి వర్ణ రహితమైనా వసుదపై పచ్చని ప౦టపొలాల సిరులు ని౦పి స్వర్ణమయ౦ చెసిన రైతుకూలిల ఎర్రని రక్త బి౦దువులవి. ఆ జీవితాల కలలు గు౦డెలొని పాతాళ౦లొ దిగ్బ౦ద౦ చేసుకుని కుమిలిపొతూ...కుమిలిపొతు నెలకొరిగి పొతున్నా.. గగనాన్ని తాకె భవనాలు కట్టి, నేలకు వన్నె తెచ్చి ని౦గినేలను ఒకటి చెసిన నిర్మాణ కూలీల చెమట చినుకులవి. తమ కడుపున పుట్టిన బిడ్డలకు తి౦డీ లేకున్నా.. భూమి కడుపులో౦చి బ౦గార౦ తీసి నేలతల్లి బిడ్డల బతుకుల్లో వెలుగు ని౦పిన కార్మిక జీవి విదిలి౦చిన తు౦పర్లవి. _ కొత్త అనిల్ కుమార్ 21 / 3/ 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEXSsM

Posted by Katta

Venktesh Valandas కవిత

రచన :వలన్దాస్ వెంకటేష్ 9505555197 మృత్యుంజయులు ---------------- నేను నాకోసం నీవు నీకోసం కొందరు అందరి కోసం.......! అజరామరం ఓక సుందర స్వప్నం ! మృత్యుంజయము కొందరి సొంతం త్యాగం ఓ సాహస క్రీడా ....! అర్పణం శికరాగ్ర కీర్తి కిరీటం ఆత్మవిశ్వాసం అమ్ములపొది సైద్ధాంతిక ఊపిరి మహాప్రస్థానం కదన సీమలో విజయ దుంధుబి వినువీధుల్లో వేగుచుక్కలు ఉరికొయ్యల ముద్దాడిన ఉక్కుసంకల్పం ....! జ్వలిస్తూనే గాండ్రించే గాండీవ సాదృశ్యం నిప్పుల వర్షపు ఉప్పెనలోనా రేపరేపలాడిన పిడికిలి జండా నెత్తురు ,సత్తువ ,ప్రాణం ,దేహం లక్ష్యం ముందు పూచికపుల్లలు శతాబ్దాల క్రితం చిరిగిన తెల్లకాగితం.... అయిన అనంత వసంతాలు దాటిన వన్నెతరగని సుందర స్వప్నం అవని మేను ఫై చెరగని పుట్టుమచ్చల ఆనవాళ్ళు చరిత్ర పుటలను తిరగేస్తుంటే అమరత్వం సజీవద్రుశ్యాలను సాక్షాత్కరిస్తునే ఉంది

by Venktesh Valandas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hNcWAb

Posted by Katta

Sravanthi Itharaju కవిత

kavitaabhimaanulandariki..kavitaadinostava shubhaakaankshalu!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK7yjZ

Posted by Katta

Kotha Kamalakaram కవిత



by Kotha Kamalakaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etALyb

Posted by Katta

Pranayraj Vangari కవిత

‘‘కవిసంగమం’’ లోని కవుల గురించి వికీపీడియాలో వ్యాసాలు రాయాలని ‘‘తెలుగు వికీపీడియా’’ ప్రయత్నంచేస్తుంది. కవి మిత్రులందరూ క్రింది లంకెలోని ఫారంలో తమ తమ వివరాలు అందించగలరు (ఒక పుస్తకం అయిన ప్రచురితమై ఉండాలి).... http://ift.tt/1etALhQ ఫోటోలను pranayrajvangari@gmail.com కి పంపించగలరు....

by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fLVz0g

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\విబంధం\\ -డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చందమామ ఇంటి మీంచే సాగిపోతుంటది మెర్క్యురీ బల్పునే జాబిలిగా విశదమవుతం ఆహ్లాదమై అంతరంగాన్ని తాకే వెన్నెలకు నో స్పేస్ సూర్యడు ఎప్పటిలాగే సంచరిస్తుంటడు పగలు కూడా నియోన్ లైట్‌నే సూర్యుడని మైమరుస్తం ఛాయ వెనుక నిలబడ్డ నిజానికి నో స్పేస్ పగళ్లు కదిలిపోతుంటవి రాత్రుళ్లు కరిగిపోతుంటవి ఇరు సంధ్యల రంగుల వాకిళులకు నోస్పేస్ వాన వచ్చి తడితడిగా పలకరిస్తుంటది చినుకు సోకకుంట కవచాలెన్నో కప్పుకుంటం అద్భుత పులకరింతకు నో స్పేస్ చెల్లె వచ్చి ముందు కూర్చుంటది చెలి ఎంతకూ వదలదు సెల్‌లో రాఖీలా వచ్చిన చెల్లెకు నో స్పేస్ కలబోసుకుందామని ఎప్పటి స్నేహితుడో కాల్ చేస్తుంటడు అంతర్జాల ఇంద్రజాల కిక్కుల చిక్కుకుంటం పక్కనే కలవరించే దోస్త్‌కు నో స్పేస్ ఎండ ఎదురొచ్చి చేతులు సాపుతుంటది కిరణాలు తాకకుంట చలువ తంత్రిణులు నులివెచ్చని స్పర్శకు నో స్పేస్ మాఘమాసం కౌగిలికై అల్లుకుంటది అలకో అహమో బ్లాంకెట్‌కటూ ఇటా బ్రాంకట్లు ఆది అనంత ఆత్మల ఐక్యతకు నో స్పేస్ అమ్మ నుంచి అనవరతంగా ఆ్తమ రింగవుతుంటది భార్య అనారబిటస్ మాల్ చెవిలో చేరదు ఆదుర్దాయై ప్రసరించే అమ్మ వాసనకు నో స్పేస్ బంధం ఒంటరి శిలాజమై పోయింది పురాశిల్పం కన్ను తెరిచి చూస్తున్నది -

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hLXLXX

Posted by Katta

Pusyami Sagar కవిత

ఘటనలు ______________పుష్యమి సాగర్ గుండె ను తాకిన భావస్పోరకాన్ని చేతులోకి తీసుకొని ముద్దాడినపుడు, కళ్ళు చెమర్చాయి, రెక్కలు తొడిగిన కొత్త ఆలోచన ఏదో గిరికీలు కొడుతూ అక్షరం చుట్టూ ప్రదక్షణ చేస్తుంది ..!!! మట్టి లో మొలకెత్తిన జ్ఞాపకం నిలువెత్తు చెట్టు గా మారినపుడు పునాదుల కింద దాక్కొన్న చరిత్ర , తనని తానూ తవ్వుకుంటూ తొవ్వ చూపిస్తుంది చీకటి కమ్మిన వెలుగు కు,!!!!! అప్పడు అప్పుడు నేను ఉన్నానంటూ తొంగి చూసే వేకువ ఉదయాలు నగర అరణ్యం లో గతి తప్పి తిరుగుతూ కాగితం పై ఒలికి పోతుంటాయి కద గానో, కవిత గానో అచ్చు పోసుకుంటూ ...!!! కలలు న్ని కుప్పలు గా నడి రోడ్డుకు అటుక్కుపోతాయి లెక్కపెట్టలేనన్ని మడతలు గా ... ప్రతి రాత్రి ప్రశ్నిస్తుంది ఉదయం ప్రశాంతం గా పోడుస్తానా అని !!!! ఇప్పుడు నాచే కొలవబడ్డ కొన్ని ప్రమాణాలు లెక్క సరి చూసుకున్నాయి ప్రతి ఘటనను మనోపలకం పై ముద్రించడానికి ...!!!!! మార్చ్ 21, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuvAz

Posted by Katta

Krishna Mani కవిత

మమతలకు నెలవాలం ఊహలకు కొలమానం వేదనలకు ఉపమానం ఉద్వేగాలకు జననాదం ఇవే కదా కవికి కావలిసిన అక్షరయాగ హవిస్సులు ప్రతి కవి ఒక అగ్నిగుండమై చేయు యజ్ఞంలో ఉద్భావించు ఎన్నో కవితాపుష్పాలు సేద తీర్చే చల్లని పరిమళ జల్లులు ! మిత్రులకు అంతార్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు కృష్ణ మణి I 21-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuxbt

Posted by Katta

Sriramoju Haragopal కవిత

కవిత్వం నా నేస్తం ఖాళీ గదిలాంటి నా గుండెలో ఆత్మీయ అతిథి, గదిలో, మదిలో తడి తడి వొడువని యాదిలో మైదానంలో, నది ఒడ్డున, కీకారణ్యంలో గోగుపూల దండులో గోర్వెచ్చని సహచర స్మృతులలో ఎక్కుపెట్టిన గురిలో, ఎగిరే పొద్దు జెండాలో నన్ను మనిషిగా నిలిపిన మానవీయత కవిత్వం దుఃఖితుల బాధల్లో నన్ను సహానుభూతం చేసి నిరాశ్రయుల ఆవేశంలో నన్ను సహచరుణ్ణి చేసి గాయపడిన పావురాల గొంతుకను చేసి రాయబడని గాథల గేయంగా పాడించి నన్ను నడిపిస్తున్న నా సహవాసి నా కవిత్వం వాగ్దానాల పలకజెముడు దొంగముల్లు కుట్రల్నిఛేదించి అన్నీ మింగే కూకేటిపాముల బొయ్యారం కడుపుల్నిచీల్చి బతుకు నాగేటిసాల్లల్ల నాటిన పైసలంగడిని పాతర్లేసి బతికి బతికించే గడ్డిపరకల గెలుపు రహస్యాల్ని బోధించింది నాకు కవిత్వ తత్వవేత్తే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuv3t

Posted by Katta

Vijaykumar Amancha కవిత

కవితా ప్రియులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాక్షలు జై కవిత్వం జయహొ కవిత్యం

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r4eEnt

Posted by Katta

Panasakarla Prakash కవిత

వీడని నేస్త౦ నిద్దురలో౦చి లేచానో...కలలో౦చి లేచానోగాని కళ్ళు నలుపుకు౦టూనే ఉన్నాను చేతిలోని గీతల్ని ఒక్కసారి చూసుకుని దేవుడికి నమ్మక౦గా నమస్కరి౦చాను రాత్రి చెరిగిన పక్కని సరి చేసుకోడానికి వెలుతురు సాయ౦ తీసుకు౦టున్నాను చీకటిని వర్ణి౦చగలను కానీ వెలుతురును నిలువరి౦చలేను కదా అ౦దుకే నేనూ పరిగెడుతున్నాను ఆకాశమ౦తా ఒకే వర్ణ౦................. అ౦దుకే నేల ర౦గు సువర్ణ౦.......... నిన్నటి గాయాల్ని మాన్పిన చీకటిని గదిలో ఒ౦టరిగా బ౦ధి౦చి ఎలాగోలా బైట పడ్డానా..................... ఐనా వెలుతురులో నీడై వె౦బడిస్తూనే ఉ౦ది............ పనసకర్ల‌ 21.03.2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMuuws

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | కవుల చేవ -------------------------- అయం బన్ధురయం నేతి గణనా క్షుద్రచేతసామ్। ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్।। "అల్పమైన ఆలోచనలు కలవాళ్లకి వీడు చుట్టం వీడు చుట్టం కాదు అన్న పట్టింపులు ఉంటాయి. అదే గొప్ప నడువడి కలవారికి ప్రపంచమంతా తన కుటుంబమే," అని ప్రపంచకవులను ఉద్దేశ్యించి ఒక వ్యాసకర్త అభిప్రాయం. కవి ప్రపంచబంధువు అలాగే All that is best in the great poets of all countries is not what is national in them, but what is universal" - Henry Wadsworth Longfellow స్వాప్నిక జగత్తు కాదది, గడచిన ఘనచరిత్ర కానే కాదు. సంపూర్తి కానున్న చిత్రమది. సృష్ట్యాది నుండి సాగిన గానమది. రానున్న మహత్తర భావి అది, మానవీయ మధుర కావ్యమది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నడుమ పృధ్వి ఒక్కటే. వేలు, వేవేలు, లెక్కలేనన్ని, పాలపుంతల పలుచుక్కల నడుమ ఆకాశం ఒక్కటే. భాష, వేషం, రంగు, రూపు భిన్నస్వరాల ఏకీభావం ఒక్కటే. యుద్దభీతి, కీర్తికాంక్ష, స్వార్థభక్తి, కుటిలనీతి పెకలించిన జాతి అది. శాంతి, సమత, మమత, ఆత్మీయత విలసిల్లిన రీతి అది. తరులు, గిరులు, నదులు, మైదానాలు సాంత్వన చెందిన ప్రకృతి అది. కదలాలి కలాలు, పాదాలు కలిసికట్టుగా మానవత్వమే సాధనగా, కవిత్వ పథాన రావాలి నవతరం కొత్త పుంతలు తొక్కుతూ సాహిత్య ప్రపంచం కావాలి వసుధైవకుటుంబకం 21/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r4eDQo

Posted by Katta

భావరాజు శ్రీనివాసు కవిత

నేనెవరు? - అని ప్రశ్నించుకొని గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారుంటుందని నేను నమ్ముతాను. బ్రహ్మ కుమార్తె సంధ్య , అరుంధతిగా మారడానికీ ఈ ప్రశ్నే కారణం . అహల్య విషయమూ అంతే . గౌతమ సిద్ధార్థుణ్ని ,బుద్ధుడుగా మార్చిందీ, విశ్వామిత్రుణ్ని,బ్రహ్మర్షి గా మార్చిందీ ఈ ప్రశ్నే . నేనెవరు? - ఈ ప్రశ్నకు నేను అన్వేషించిన సమాధానాన్ని ‘భావరాజు భావాలు’గా ఈ క్రింది link ద్వారా మీతో పంచుకోవాలని .....

by భావరాజు శ్రీనివాసు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMutZu

Posted by Katta