పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Sana Chittaluri కవిత

చిత్తలూరీలు మీ కట్టుబాట్ల ఇనుప గొలుసులు వేసి పూల చెట్లను లాగకండి విస్తరించే పరిమళాన్ని బంధించటం మీవళ్ళేమవుతుంది. మీ అజమాయిషీల చేతులు చాచి కోయిలల కంఠాలను నొక్కకండి నినదించే ధిక్కార స్వరాన్ని ఆపటం మీ వళ్ళేమవుతుంది. ** ** ** వంటింటి కుందేళ్ళు పాత పాట. పులులు కూడా వంట చేస్తాయి... రుచులు పోయే అమ్రుత హస్తాలు అవసరమైతే పంజా విసురుతాయి.. కొత్త మాట. ** *** ** నా పద్యాలేమైనా పావురాలా ఎగరేసిన చోటికే మళ్ళీ తిరిగి రావటానికి.. అవి పాడుతూ పడుతూ వెళ్ళి ఏ తోటలోనో తప్పిపోయిన కోయిలలు. చిత్తలూరి 9912346673

by Sana Chittaluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWECVm

Posted by Katta

Sree Kavitha కవిత

శ్రీకవిత || హ్రుదయ సరాగాలు || 23.03.2014 నిన్నే నిన్నే తలచుకొని మది వీణను మీటే రాగం నీవవనీ నన్నే నాలో నెమరేసుకొని మది అంతరంగం లో మ్రొగే ఆలాపన నేనవనీ ప్రతి రోజు కవితై వచ్చి నిను వర్ణించనీ ..వర్ణించనీ..!! ఎన్నో ఎన్నో భావాలను తలపులలో రచియించాను మొదటి ఆక్షరం నీవవనీ భావాల ఝరిలొ విజ్రుంభించే పదాలు ... గమించె గమనం నేనవనీ ప్రతి కవితా మాలికలో ప్రస్ఫుటింఛె అర్దం నీవని ..!! అక్షరం అక్షరం కలిపి పలికే రెండక్షరాల "ప్రేమ "కి అర్దం మనమవ్వని 'ప్రే'రణతో మనోహరమైన ఆకర్షణ నీవనీ 'మ'దురంగా మైమరిపించే యంత్రం నేనవనీ ప్రతి ఆకర్షణలో చెలరేగే పులకింతల పరవశాల .. 'ప్రేమ'లొకంలో మనం ఒకటై !! .. విహరించనీ..!!

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWEB3R

Posted by Katta

Jyothirmayi Malla కవిత

|| జ్యోతిర్మయి మళ్ళ|| ఊరికొక్కరు వీళ్ళు... మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు ప్రతిభుంటే సరిపోతుందా నాలుగుగోడలు చూస్తూ అది బతికేస్తుందా ఎంత కోరిక ఎంత తపన ఎంత శోధన ఎంత సాధన ఎన్నుండీ ఏంలాభం ఎత్తుకెత్తే మెట్టు దొరకక? మన ఇల్లు మనం కట్టుకోగలం గానీ విజయశిఖరానికి ఎక్కించే మెట్లు మనం కట్టగలమా అవి ఎవరో కట్టిపెట్టాలి మొదటిమెట్టుమీద మనల్ని నిలబెట్టాలి ఒకో మెట్టూ ఓ విజయానికి పునాది రెండో విజయానికి స్ఫూర్తి అదిగో అలాంటి కట్టుడు పనిగాళ్ళే వీళ్ళు.. మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు కాళ్ళు మొక్కాలనిపించే కళాపోషకులు ఎక్కేందుకు కాదు వారి శ్రమ ఎవరినో ఎక్కించేందుకు వీరి స్వేదం ఎవరికో శీతలపవనం వీరి ఆరాటం ఎవరికో ఆనందం వీరి కష్టం ఎవరికో ఫలితం వీరుకట్టిన మెట్లమీంచి ఇంకొకరు ఎక్కడాన్ని చూస్తూ పడుతున్న చమటని తుడుచుకోడం మర్చిపోయే సహృదయత్వం గెల్చినవారి ఆనందాన్ని తమ ముఖాల్లో వెలిగించుకునే సున్నితత్వం నిస్వార్ధం వీరి రక్తంలో దూరి ప్రవహిస్తుంటుంది మానవత్వం వీరి అడ్రసు వెతుక్కుని నివసిస్తుంటుంది వీళ్ళే..ఆ మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు ఊరికొక్కరుంటే చాలనిపించే దేముళ్ళు ! (సూర్యపేటలో నా గజల్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు సోదర సమానుడు శ్రీ Ganesh Peddireddy గారు పడిన శ్రమ ను చూసినపుడు కలిగిన భావావేశం ఈనాటి ఈ కవిత నా గజల్ ప్రయాణానికి దారి చేసి ఇలాంటి మేస్త్రీలు..శ్రీ కొమ్మోజు సత్యనారాయణ గారు(కొసనా, విశాఖ), శ్రీ Kranthi Srinivasa Rao గారు (ఖమ్మం), శ్రీ Peddireddi ganesh గారు (సూర్యాపేట), శ్రీమతి Hema Valluri గారు..ఇలా ఎందరో..అందరికీ ఈసందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి)

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpns1H

Posted by Katta

Sri Venkatesh కవిత

***పైసా*** ప్రస్తావన : మనిషి యొక్క స్థితిని గతిని నిర్ణయించేది డబ్బు, డబ్బు యెంత అనివార్యమో ప్రస్తుత లోకంలో మనకు తెలియనిది కాదు, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ రాసిన చిన్న అక్షరమాలిక!!! మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తూ మనమే తన సృష్టికర్తలం!!! సృష్టించాం, రూపమిచ్చాం, నామకరణమూ చేసాం, చాలలేదు తనకి మనకి కూడా, ఆపై రకకరకాల రూపాలతో, పలురకాల పేర్లతో, సృష్టించిన మనల్నే శాసిస్తూ, పాలిస్తూ, లాలిస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ, వంచిస్తూ, తుంచేస్తూ, అనుబంధాలను తన బంధీలుగా చేసి, ప్రతి మనిషి నుదుటిపై "నా బానిస" అని రాసి, దారేదైనా చేరే గమ్యం తానంటూ, రోగమేదైనా తగ్గే మార్గం తానంటూ, "పుణ్య,పాప,మిశ్రమ"కర్మత్రయాలకు మూలమై, ప్రేమానుబంధాప్యాయతల పట్ల శూలమై, మానవ అగత్యాలకు, ఆకృత్యాలకు, అభిష్టాలకు తానే అనుమతమై, అభిమతమై, కోరికైన, కనకమైన, కాంత ఐన, కామమైన, కష్టమైన, క్లిష్టమైన, పరిస్థితి ఏదైనా పరమార్ధం తానై, జేబు ఏదైనా డాబు ఉండాలంటే తాను తప్పనిసరని, తనకి తాను తప్ప వేరెవరు లేరు సరని, చంకలు గుద్దుకుంటుంది. భూగోళం మొత్తం తన గోళాకార ఆకారం చుట్టే, విలువలలో హెచ్చుతగ్గులు దీని మోతాదును బట్టే, కర్త, కర్మ , క్రియ అంతా పైసా, మనిషికి దీనిని ఆర్జించడం పైనే జ్యాస, ఇదే అందరి శ్వాస!!! పైసామే పరమాత్మా, పైసా ఆ పరమాత్మ ఇంకో జన్మ!!!

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpnrL8

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

స్నేహ సంస్కృతి ’రాస్తా’ లన్నిట ప్రక్కలన్ వెలయు ’యీరానీ కెఫే’ లందునన్ ’మస్తుం’డున్ గద ’రద్ది’! ఐన నట, ’ఛాయ్’మాధుర్యమున్ గ్రోలరే - దోస్తుల్ పల్వుర గూడి రోజు, యువకుల్ ’దోతీను బా’రేగుచున్! ఆస్తుల్ గాంచగ స్నేహ సంస్కృతి కవేగా ’హైదరాబాదు’లో!

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jp96yt

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవిత



by రంజిత్ రెడ్డి కర్ర



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ldIRPH

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||రో*శోధన|| ఇప్పుడిక కవిత్వం బట్టలు విప్పుకుని, నగ్నంగా నిలబడి, బెరుకులేకుండా రోదించడం మొదలుపెట్టింది, ఇక శోధించుకోండిరా, నన్ను అంటూ పిచ్చిగా అరుచుకుంటూ,. అయినాసరే, మనకి విషయమే ముఖ్యంకదా, సత్యాన్వేషకులంకదా,. శోధనే మన ప్రాణం కదా., మనకు సూత్రాలే ముఖ్యం కదా, ఒక పదనైన కత్తినై, కోల్పోయిన విచక్షణతో గాట్లు పెట్టి ఆ శరీరం పై, నేను రాసుకుంటానిక, లోపలి అవయవాలను వెలికితీస్తూ, సత్యం వెలుగులను ప్రసరించుకుంటూ, విపులంగా నోట్సు రాసుకుంటానిక,. ఇది చైతన్యవంతమైనదని, ఉదాత్తమైనదని, సౌందర్యవంతమైనదని, దివ్యమైన ఓదార్పని,. అందరి తుత్తరలు తీర్చే వేశ్యని, కీర్తికాంక్షకుల వాహకమని, నా అంతరంగ స్వయంతృప్తని, ఇదొక జీవనదని, మహాముదరదని లేత కొబ్బరని, జీవన నైవేధ్యమని లాలించే అమ్మని,. ప్రకృతని, పరమాత్మని ******* శోధించి, శోధించి అలసిపోయి దాని చెంతనే మళ్లీ సేదతీరుతాను. బహుశా, శవం లాంటి ఆ వడిలోనే. అన్నీ మరిచిన పసిపాపలా, అది ప్రేమగానే హత్తుకుంటుంది,. మళ్లీ. -----------------------------------------------23/3/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OMAlJv

Posted by Katta

Rajeswararao Konda కవిత

సేవలు నాస్తి... ఆస్తులు జాస్తి... నమస్తే... నేస్తమా..! @ రాజేష్ @ 23/03/14 ఇదేమిటా... అనుకుంటున్నారా.. అవునండీ.. ఇదినిజం పచ్చినిజం..! మన దేశంలో ఆస్తులు పెరగాలంటే షేర్లు కొనాల్సిన అవసరంలేదు లాటరీ టిక్కెట్ కూడా కొనాల్సిన పనీలేదు ప్రజసేవ పేరుతో నేతలైతే చాలు ఉన్న ఆస్తులు వాటంతట అవే పెరిగిపోతాయి ఒకటికి వందరెట్లవుతాయి ఎందుకవుతాయో ఎలా అవుతాయో వారికే తెలియదు మనకెలా తెలుస్తుంది అయితే ఇక్కడో ట్విస్ట్ ఉందిలే అదేనండి.. ఏ సేవ చేస్తామని వచ్చారో ఆ సేవ కించిత్ కూడా పెరగదు కనీసం ప్రజలను పలకరించే సమయం కూడా దొరకదు వారికి అదేమంటే ప్రొటోకాల్ అంటుంటారు బడా నేతలు కాకముందు ప్రజలు కావాలి పదవులొచ్చిన తర్వాత అధికారం రావాలి అధికారం రాగానే ఆస్తులు పెరగాలి ఆ ఆస్తులు పెరగాలంటే ప్రజాసేవ మరవాలి ఇది నిజం... నేటి యిజం... కాదంటారా నేస్తమా..!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhpe9x

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || వదులుకోక తప్పదా..? || చిన్నోడు అడిగాడు నాన్నా వదులుకోక తప్పదా ఒకటి కావాలంటే మరొకటి వాడి ప్రశ్నతో నేను ఉదయించాను ఈరోజు అవును వదులుకోక తప్పదా అని ******* ఎండిన ఆకులును కొమ్మ వదులుకొని పచ్చని ఆకులుకు జన్మనిస్తాది రాత్రి వెన్నెలను వదులుకొని వెచ్చటి సూర్యున్ని రమ్మంటుంది అమ్మ వ్రేళు వదలకుంటే నేను నడక నేర్వలేనుగా బాల్యపు ఒడి వీడకుంటే ఎదిగిన నన్ను చూసేవాడినా అడుగు అడుగునా ప్రతీ అడుగునూ వదిలే నడవాలి గతం విడిచిన శ్వాస వంటింది మరలా వాస్తవాన్ని శ్వాసించాల్సిందే కంటి రెప్ప కన్నీటిని వదలకుంటే గుండె భారం తీరదు కదా ******* నేను వాడి తల నిమురుతూ అన్నాను సిద్దంగా ఉండు ఎప్పుడూ ఏదో ఒకటి వదలడానికి విలువైనవన్నీ పొందాల్సిన రహస్యం ఏదో ఒకటి కోల్పోవడంలోనే దాగివుంది త్యాగం లేని ప్రేమ కూడా ఎప్పటికీ పూయని మొగ్గలాంటిది కన్నా మీ చాంద్ || 23.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OMAlcF

Posted by Katta

Kamal Lakshman కవిత

నా ప్రతి తలపూ నీవే నా ప్రతి స్వప్నం నీవే నా ఊహల కెరటాలలో ఒలలాడిన ప్రతి అలవూ నీవే నీవు లేని సాగరమైనా నీరు లేని ఎండ మావే కదా నీ జ్ఞాపకాల సవ్వడిలో నిరంతర నీ ధ్యానంలో జీవంలేని నవ్వులతో ఆకులు రాలిన మోడువలె నన్నునేనే మరిచా నీ ఊహలలో జీవించా నీవిక రావని తెలిసి నా నీవు లేని ఈ లోకాన్ని... ఈ ప్రాణాన్ని... తృణప్రాయంగా విడిచా... కమల్

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OJwgpH

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఓ కవిత్వమా...!Posted on: Fri 21 Mar 00:36:39.869782 2014 నిన్ను ఎంతగా ప్రేమిస్తానంటే నన్ను నేనుగా అపాదమస్తకం పులకంచిపోయి నీకై తపిస్తాను. విశ్వంలోని గోళాలన్ని దోసిట నింపేసుకుని నీకర్పించి ప్రణమిల్లాలనిపిస్తుంది. నువ్వంటే నాకంతిష్టం మరి. నీవు చూపిన దారిలోనే నిరంతరం అలుపెరుగక సంచరిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా నిన్ను మాత్రమే నమ్ముకున్నా. ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సింది నువ్వే మరి. చేస్తావనే విశ్వాసంతోనే నీతో నిరంతరం కలిసి నడుస్తున్నాను. భావాలన్నింటినీ ప్రపంచ పళ్ళెంలో వేసి నైవేద్యంగా పెడుతున్నాను. నా విన్నపాన్ని ఒకసారి మన్నించు. ఆకలి దప్పులు తీర్చి అత్యాచార ఆర్తనాదాలు వినిపించని, సమాజాన్ని ఆవిష్కరించు. నీ సాంగత్యంతోనే సఫలమౌతుందనే నమ్మకంతోనే జీవిస్తున్నాను. నీవు చూపించిన దారిలో వేల కోట్ల నక్షత్రాల వెలుతురులో గుండెల్లో నిన్ను ప్రతిష్టించి ఎర్రటిబావుటా చేబట్టి, శ్రమిస్తూ సంచరిస్తున్నా. ( ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా...) -కెంగార మోహన్‌, కర్నూలుhttp://ift.tt/1h8rLMl

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8rLMl

Posted by Katta

Kavi Yakoob కవిత

"మిత్రులారా ! 'కవిసంగమం'లో రాస్తున్న కవిత్వం చూస్తుంటే కొన్ని మాటలు చెప్పాలనిపించింది. # కవిత రాయగానే వెంటనే పోస్ట్ చెయ్యకండి.కొంచెం మరొక్కసారి చూసుకుని ,ఏమైనా మార్చాలనిపిస్తే లేదా ఎక్కడైనా భావం చెప్పేటప్పుడు అది పాఠకుడికి చేరే దశలో అర్థం సరిగా చేరుతుందా లేదా అని ఒకసారి ఆలోచించి తిరగారాయండి. # కవిత్వంలో గాఢత అవసరం. మనలోకి ప్రసరించిన అనేక విషయాలను వడపోసి ,చిక్కబరిచి చెప్పే ఒకానొక ప్రక్రియ. వ్యర్థపదాలు,పునరుక్తులు లేకుండా ఒక భావాన్ని అనుభూతిప్రధానంగా చెప్పే ప్రక్రియ.కాబట్టి కవిత్వనిర్మాణంలో అత్యంత శ్రద్ధ కనబరచండి. # కవిత్వం విరివిగా చదవండి. కవిత్వ సంకలనాలు సంపాదించి చదవండి.కవిత్వానికి సంబందించిన పుస్తకాలు చదవండి.అధ్యయనం చాలా అవసరం. # ఎవరైనా మీరు రాసే కవిత్వం పైన తగు సూచనలు చేస్తే,వాటిని వినమ్రంగా స్వీకరించండి. అది మీ ఉన్నతికి,కవిత్వ ఎదుగుదలకు ఉపకరిస్తుంది.[మేం ఏం రాసినా అదే గొప్ప, దీనిపై ఎవరూ ఏం చెప్పక్ఖర్లేదనే భావనను పెంపొందించుకోకండి .కవి ఎంత ముఖ్యుడో ,పాఠకుడూ అంతటి ముఖ్యుడే.పాఠకుడు లేకపోతే కవిత్వం చేరేదేక్కడికి? కవి -> కవిత్వం->పాఠకుడు =ఈ క్రమాన్ని గుర్తుంచుకోవాలి ] # కవికి తనదైన ఒక సొంత గొంతు,మార్గం ఉంటుంది.దానిని వీడకుండా మీదైన ఒకానొక ప్రత్యేక పద్ధతిలోనే మీరు రాయండి.మీరు మరొకరిలాగా రాయకండి.ఒకే వస్తువును ఏ ఇద్దరూ ఒకలా రాయరు. ప్రతి ఒకరికీ తమదైన శైలి ఉంటుంది. # ఫేస్ బుక్ లో 'కవిసంగమం' చేస్తున్న పని - ప్రతి ఒక్కరిలో ఉన్న కవిత్వం రాయాలన్న కాంక్షను గౌరవించి, వారి రాతలకు వేదికలా నిలబడటం.అలా రాస్తూ రాస్తూ కవిత్వసృజనలో పరిణతిని సాధిస్తూ ఉండటాన్ని ,నిండుమనసుతో స్వాగతించడం ,సంతోషించడం. 'కవిసంగమం' చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం కవిత్వం మీదున్న ఇష్టమూ, అభిమానం వల్లనే. ! అందువల్ల 'కవిసంగమం' నుండి ,ఇతర కవిమిత్రుల నుండి ఏవైనా సూచనలు,అభిప్రాయాలు చెబుతున్నప్పుడు ,వాటిని గౌరవిస్తూ పాటించడానికి ప్రయత్నిచండి. ఇదంతా మనందరి కవిత్వం కోసం, కవిత్వం రాసే మీ కోసం ! జయహో !'కవిత్వం కావాలి కవిత్వం !! "

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOjgiu

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఐడెంటిటి// ఎలా చెప్పాలి ఎలాగోలా చెప్పాలి ఎలాగోలా అనేకంటే నీకు నాకూ మధ్య ఏమీలేదని చెప్పేసుకుందామా మనం అంటే వర్మనే అడగాలంటే నేనేం చెప్పగలను? అంతరాలయంలో దాగిన మట్టి వేళ్ళను చూపనా? అనంత సౌధమై వెలుగుతున్న పచ్చని చెట్టును చూపనా ? మనం అంటే లోపలా బయటా ఒకటేనని మర్మం ఒకటి విప్పనా ఓహో అదన్నమాట చిత్తం మనం, మనం ఎలాగయ్యామన్నదే ఈ లోకానికి ఓ సందేహం ప్రియతమా నీలో నాలో దాగిన దుఃఖం చాలదూ మనం మనం అని చాటడానికి పిచ్చిలోకం దానికీ తెలుసు దుఃఖం దుఖం మధ్య అగాధం సంతోషం దాని లోతులు దాపరికాలు తొలగాలంటే తానూ శిఖరం నుంచి రాలిపడాలని రాలిపడిన పువ్వు ఒక్కరోజూ నవ్వలేదు బాల్యాన్ని గుర్తు చేసుకుని ఏడ్వనూ లేదు నిర్వేదం అనుకున్నారంతా కానీ, రాలిన పువ్వుదొక తన్మయం. అమ్మ ఒడిలో జోల పాట వింటున్న సంబరం ఈ సంబర సందర్భం మనకొక ద్వారం తెరుచుకొన్న మనో:కుహరం మనల్ని తమలో కలుపుకోలేని తమకాలకి ఆలింగనాలకూ, కర స్పర్శకూ అందని ప్రపంచానికి మనం ఒక నువ్వూ , ఒక నేనూ... మనం దాపరికాలు లేని నగ్నవనం దేహాలు మిగుల్చుకున్న మనస్సులం అర్ధరాత్రి కట్రాడు తెంపుకుని వీదినపడ్డ లేగదూడలం మనం రాత్రుళ్ళు పశుపక్షాదుల మెరిసే కన్నులం చీకటికి అలవాటు పడ్డ కళ్ళు అద్దరాత్రి రాసుకునే కవిత్వం తెల్లవార్లూ తలచుకునే తన్మయత్వం... 22/03/2014

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDMks5

Posted by Katta

నేనే ఇమ్రాన్ శాస్త్రి కవిత

"నాకది చాలు" రచన:ఇమ్రాన్ శాస్త్రి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కాలమంతా గడపొద్దు.. పగలంతా నిను వెతికే కనులకు ఎదురైతే చాలు....! గుండెల్లో గుసగుస మని పలికే భావాలన్నీ చెప్పొద్దు.. పెదవంచున మౌనం దాచిన మాటెంటో పసిగడితె చాలు...! ప్రతి నిమిషం వెనువెంట తిరిగే నీడలా మారొద్దు.. నీ వెనక నడిచేటప్పుడు నా వైపు చూస్తే చాలు...! నీ ధ్యాసలో పడి నే మరచిన నన్ను., నువ్వు గుర్తించొద్దు... నీకంటూ ఏమి కాని నేను నీకై ఉన్న వాడిలా గుర్తుంటే చాలు....! నే రాసే ప్రతి లేఖకి బదులివ్వకపోయినా పర్లేదు.. అవి చేరలేనంత దూరంగా నీ చిరునామ మార్చకుంటే చాలు...! బ్రతుకంతా నీ జతలో ఉండాలనే ఆశకు ఆయువు పోయద్దు.. కను మూసిన నా కథ విన్నాక నీ కంట కురిసే ఒక్క కన్నీటి బొట్టు చాలు...!

by నేనే ఇమ్రాన్ శాస్త్రి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOjeXS

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 26 . కవిత్వం అంటే ఏమిటి? ఇదొక మిలియన్ డాలర్ ప్రశ్న. దీనికి ఎన్ని వందల తరాలు ఎంత స్పష్టంగా, సోదాహరణంగా చెప్పినా, చెప్పకుండా మిగిలిపోయింది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయినా కవులు కవిత్వం చెప్పకనూ మానరు; కవిత్వాన్ని నిర్వచించడానికి ప్రయత్నించకా మానరు. ప్రపంచ కవితా దినోత్సవం సమీపంలో ఈ టపా వేస్తున్నాను కాబట్టి, నా స్నేహితురాలు, మంచి భారతీయ కవయిత్రి అయిన Shernaz Wadia వ్రాసిన కవిత మీకు పరిచయం చేద్దామనిపించింది. Shernaz Wadia వృత్తిరీత్యా ఉపాధ్యాయిని అయినా, మంచి కవయిత్రి. కుసుమకోమలమైన పదాలతో భావాన్ని, ఔచిత్యవంతమైన పదాలతో అర్థాన్నీ వడగట్టగల ప్రతిభాశాలి. ఈ కవితలో కవిత్వానికి ఉన్న అనేక పార్స్వాలు స్పృశిస్తూనే, ఒక్కొక్క పార్స్వాన్నీ ప్రకటించడానికి ఆమె ఎన్నుకున్న వస్తుసముదాయాన్ని చూడండి. సంప్రదాయమైనా, ఆధునికమైనా కవిత్వం జీవితానుభవంలోంచి, వైయక్తిక స్పర్శతోనీ రావాలని నా అభిప్రాయం. . కవిత ... . కవిత ఎలా ఉండాలి? స్ఫటికం లా... అంది నిశ్చల సరస్సు మెరుస్తూ నాలా ఉదాత్తంగా --- గంభీరంగా పలికింది మహావృక్షం నిరాఘాటం గా ప్రవహించాలి --- గలగలలాడింది సెలయేరు సద్యః స్ఫురణ కలిగిస్తూ జీవం తొణికిసలాడాలి --- కూని రాగాలు పోయింది పిట్ట సువాసనలతో మత్తెక్కించాలి --- ఝుంకరించింది తుమ్మెద మనసు దోచుకోవాలి --- నవ్వింది సీతాకోక చిలుక రమణీయం గా ఉండాలంటేనో? అడిగాయి పూలు లోతుగా సారవంతంగా ఉండాలి --- ఘోషించింది లోయ కొంత రాజసం కూడా ఉండాలి -- ప్రతిధ్వనించాయి కొండలు ఆహ్లాద పరచాలి సుమా--- గుసగుస లాడింది వేసవి తెమ్మెర కరిగిపోతూ ఆలోచనలు గిలకొట్టాలి -- గలగలమన్నాయి శిశిర పుటాలు ఇకనేం అని రమణీయ ప్రకృతి నడుమ భావావేశంతో గబగబా బరికేశాను సగర్వంగా నా కవిత్వాన్ని అంకితం ఇద్దామని. ప్రకృతి ఒక్కసారి భళ్ళున పగలబడి నవ్వింది ఓరి మూర్ఖాగ్రేసర చక్రవర్తీ! ప్రకృతి అంతరంగాన్ని అవిష్కరించడం అంత సులువుట్రా? శాశ్వతత్వపు చిరుశ్వాస అందులో ఏదిరా? . Shernaz Wadia. . A Poem How should a poem be? Crystalline, mirrored the placid lake Stately like me, intoned the tree Free flowing, gurgled the river Spontaneous and lively, crooned a bird Fragrantly enticing, droned the bee Captivating, laughed the butterfly. How about colorful? Asked the flowers Deep and meaningful, averred the vale With certain majesty, echoed the hills. Refreshing, whispered the summer breeze Mellow. Evocative. Crackled autumn’s leaves So, deep within the inspiring woods I scribbled and scrawled and hastened To proudly dedicate my poem... All nature burst into splits! Oh, you poor nitwit! The soul of nature cannot be conveyed Except with the breath of immortality! English Original: Shernaz Wadia Indian

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDMmA7

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || తిప్పరదండం ఉక్కుగోళ్ళ లోహపు పక్షి ఒకటి ముక్కుతో పొడుస్తూ తెగతిడుతోంది. సజీవ శిలాజంలా మిగిలున్న ఓ పిచ్చిపిట్టని వెధవపక్షీ ఎప్పుడూ ఎందుకిలా మొత్తగా వుంటావంటూ లేబుల్ సీసాలోని నీళ్ళు ఎగిరెగిరి మిడిసిపడుతూ మూగనదిని ఆడిపోసుకుంటున్నాయి. పిచ్చిమొహమా కొంచెం నాగరికత నేర్వరాదేఅంటూ ... వెనకగదిలోని అమ్మకాలం నాటి నిర్మలత్వంలాగానే అవికూడా మౌనాన్నే సమాధానమిస్తున్నాయి. ► 23-03-2014 ► http://ift.tt/1pm2nXG

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pm2nXG

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ కవిత్వ౦ @ కవిత్వమ౦టే ఎవరికి తెలియని వి౦త భాష కాదు ఎక్కడొ తగిలేట్టు రాయడ౦ కాదు తెలియనిదేదో చెప్పినట్లు రాయడ౦ కాదు అసలు విషయాన్ని అర్ద౦ కాకు౦డా మెలిక పెట్టి చెప్పడ౦ కాదు ఇల్లు సదిరినట్లు అక్షరాలని తీర్చిదిద్దడ౦ కాదు మన౦ చెప్పాలనుకున్న దాన్ని ఇ౦కొకరు చెప్తేనే అర్దమయ్యేటట్లు రచి౦చడ౦ కాదు. బుర్ర బద్దలు కొట్టుకుని రాసి చదివే వారి బుర్ర బద్దలు కొట్టడ౦ కాదు మనకున్న అసూయను ఇతరులపై పెట్టి వేలెత్తి చూపడ౦ కాదు కవిత్వమ౦టే.... మనసుతొ మాట్లాడె మధుర భాష చదవగానె హౄదయానికి సుతిమెత్తగా తగిలె చెక్కిలి పై ను౦డి జారె కన్నీటికి ఆనకట్ట కవిత్వ౦. గు౦డె భాష మెలికలలొ చిక్కుకున్న జీవితాన్ని చక్కదిద్దె ఒదార్పు భాష అలిసిన యెదలు సెద తీరె చల్లని నీడ కవిత్వ౦ స్ప౦ది౦చిన హౄదయ౦ లో౦చి వెల్లువెత్తి మనసులను ఉత్సాహపరిచె ఇ౦దన౦ కవిత్వ౦ కల్మశమైన వ్యక్తిత్వాలను ప్రక్శాలన చెసే ప్రక్రియ కవిత్వ౦ నిస్సిగ్గుగా దేశద్రోహానికి పాల్పడె నీచుల వీపుపై బర్గె దెబ్బ కవిత్వ౦ బుర్ర బద్దలు కొట్టుకు౦టె వచ్చేది కాదు గు౦డెలు బద్దలు కొట్టుకు౦టె వచ్చేది నిజమైన కవిత్వ౦. _ కొత్త అనిల్ కుమార్ 22 / 03 /2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gmX3DS

Posted by Katta

Kavi Yakoob కవిత

ఉత్తమ వ్యాఖ్య : :) బాల సుధాకర్ మౌళి 'కవిత్వ అనుభవం' పోస్టింగ్ కి స్పందన : by Rajasekhar Gudibandi చాలా నిజాయితీ , నిబధత కూడుకున్న వాక్యాలు మౌళి . నువ్వు రాసింది చదువుతుంటే నా బాల్యం గుర్తుకొస్తుంది. నేను తొమ్మిదో తరగతి లో ఉండగా ROOTS (ఏడుతరాలు) మా నాన్న , నేను పోటీపడి చదవటం ఇంకా జ్ఞాపకమే ... అప్పుడు చదివిన శ్రీశ్రీ , బైరాగి కవిత్వం , గోర్కీ “అమ్మ”, ఇంకా రష్యన్ అనువాద సాహిత్యం , అభ్యుదయ , విప్లవ సాహిత్యం నాకు ఇప్పటికీ చోదక శక్తిగా పనిచేస్తుంది. నువ్వన్నట్లు “వొకొక్కప్పుడు కవిత్వం కొందరికి చెందిన సరుకుగా చెలామణి అయినా చివరకు అది చేరాల్సిన వాళ్ల చేతుల్లోకే చేరింది.” కొంతవరకు నిజమే కానీ ఇంకా చేరాల్సిన చోటులు చాలా ఉన్నాయనే అనిపిస్తుంది....ఇప్పటి కవిత్వం చదివేవాళ్ళలో ఎక్కువమంది రచనారంగంలో ఉన్నవాళ్ళే.. కవులో, విమర్శకు లో,రచయితలో. ఎంతమంది సామాన్యపాఠకుడికి చేరుతుంది. నాఉద్దేశ్యం ఏమిటంటే కవిత్వం రాయటంతో పాటుగా చదివే వాళ్ళను కూడా తయారు చేయాలి. స్కూలు స్థాయి నుండే అది మొదలవ్వాలి ...ఏడో తరగతినుండే IIT, MBBS లకోసం తాయారు చేయాగాలేంది , కవిత్వం కోసం ఎందుకు తయారుచేయలేం... కవిత్వమనేకాదు సామాజిక స్పృహ , మానసిక వికాసం కల్గించే ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే... ఇక మౌళి.. నీవరకు నీవు మీ స్కూలు పిల్లల్ని తయారుచేసే విధానం అందరికీ ఆదర్శం... కవిత్వం చేతిలో నువ్వొక ఆయుధం గా కవిత్వం చరిత్రను తిరగరాయాలని, చరిత్రగా మిగిలిపోవాలని మనసారా కోరుకుంటున్నాను..

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gmX2jA

Posted by Katta

కాశి రాజు కవిత

కాశి రాజు || కమ్యూనికేషన్ || ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని ఎవరినడిగితే తెలుస్తుంది కాల్ కట్ చేస్తే ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న అన్న సంభాషణ సమాదైపోయి రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు నీరసాన్ని బద్దకంగా చేసుకుని బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది మెట్లుదిగి కాస్త ముందుకెళితే ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pm2lzd

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Renuka Ayola కవిత

రేణుక అయోల //నేల జారిన చాయ// పగలు లోకాన్ని మోస్తూ నిద్రలో కల్పించుకున్న లోకాన్ని ఆలోచిస్తూ అనుభవాలు మాటలు ఇస్టాలు ద్వేషాలని ఇముడ్చుకుని రేకులు కప్పుకున్న మొగ్గలా పడుకున్న శరీరం నిల్చుని నీడలో భాగమైనడుస్తుంది కాంతిలో పొద్దుతిరుగుడు పువ్వు పోడుగ్గా నేలని కావలించుకున్న నల్లని ఆత్మ రేగుతున్న జుత్తు ఊగుతున్న చేతులు నడుస్తున్న పాదాలు నేలమీద వాలిపోయిన రూపం విడివిడిపోని రూపం గోడల మీద మేకులుతో కొట్టని చిత్రపటం వాలిపోయిన పోద్దులో తగ్గిపోతున్న కాంతిలో అదృశ్యమైన ఛాయ వీపుని చేరుకున్న స్వేచ్చ ఇంట్లో కూడా బల్బుల అర్ధకాంతిలో కదిలే వేళ్లని కావలించుకున్న ఆకారన్ని సొఫాల మీద పరుకున్న పక్కమీద మనకింద నోప్పిలేని శరీరంతో మౌనంగా నిద్రపోతుంది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h73vKv

Posted by Katta