పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 26 . కవిత్వం అంటే ఏమిటి? ఇదొక మిలియన్ డాలర్ ప్రశ్న. దీనికి ఎన్ని వందల తరాలు ఎంత స్పష్టంగా, సోదాహరణంగా చెప్పినా, చెప్పకుండా మిగిలిపోయింది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయినా కవులు కవిత్వం చెప్పకనూ మానరు; కవిత్వాన్ని నిర్వచించడానికి ప్రయత్నించకా మానరు. ప్రపంచ కవితా దినోత్సవం సమీపంలో ఈ టపా వేస్తున్నాను కాబట్టి, నా స్నేహితురాలు, మంచి భారతీయ కవయిత్రి అయిన Shernaz Wadia వ్రాసిన కవిత మీకు పరిచయం చేద్దామనిపించింది. Shernaz Wadia వృత్తిరీత్యా ఉపాధ్యాయిని అయినా, మంచి కవయిత్రి. కుసుమకోమలమైన పదాలతో భావాన్ని, ఔచిత్యవంతమైన పదాలతో అర్థాన్నీ వడగట్టగల ప్రతిభాశాలి. ఈ కవితలో కవిత్వానికి ఉన్న అనేక పార్స్వాలు స్పృశిస్తూనే, ఒక్కొక్క పార్స్వాన్నీ ప్రకటించడానికి ఆమె ఎన్నుకున్న వస్తుసముదాయాన్ని చూడండి. సంప్రదాయమైనా, ఆధునికమైనా కవిత్వం జీవితానుభవంలోంచి, వైయక్తిక స్పర్శతోనీ రావాలని నా అభిప్రాయం. . కవిత ... . కవిత ఎలా ఉండాలి? స్ఫటికం లా... అంది నిశ్చల సరస్సు మెరుస్తూ నాలా ఉదాత్తంగా --- గంభీరంగా పలికింది మహావృక్షం నిరాఘాటం గా ప్రవహించాలి --- గలగలలాడింది సెలయేరు సద్యః స్ఫురణ కలిగిస్తూ జీవం తొణికిసలాడాలి --- కూని రాగాలు పోయింది పిట్ట సువాసనలతో మత్తెక్కించాలి --- ఝుంకరించింది తుమ్మెద మనసు దోచుకోవాలి --- నవ్వింది సీతాకోక చిలుక రమణీయం గా ఉండాలంటేనో? అడిగాయి పూలు లోతుగా సారవంతంగా ఉండాలి --- ఘోషించింది లోయ కొంత రాజసం కూడా ఉండాలి -- ప్రతిధ్వనించాయి కొండలు ఆహ్లాద పరచాలి సుమా--- గుసగుస లాడింది వేసవి తెమ్మెర కరిగిపోతూ ఆలోచనలు గిలకొట్టాలి -- గలగలమన్నాయి శిశిర పుటాలు ఇకనేం అని రమణీయ ప్రకృతి నడుమ భావావేశంతో గబగబా బరికేశాను సగర్వంగా నా కవిత్వాన్ని అంకితం ఇద్దామని. ప్రకృతి ఒక్కసారి భళ్ళున పగలబడి నవ్వింది ఓరి మూర్ఖాగ్రేసర చక్రవర్తీ! ప్రకృతి అంతరంగాన్ని అవిష్కరించడం అంత సులువుట్రా? శాశ్వతత్వపు చిరుశ్వాస అందులో ఏదిరా? . Shernaz Wadia. . A Poem How should a poem be? Crystalline, mirrored the placid lake Stately like me, intoned the tree Free flowing, gurgled the river Spontaneous and lively, crooned a bird Fragrantly enticing, droned the bee Captivating, laughed the butterfly. How about colorful? Asked the flowers Deep and meaningful, averred the vale With certain majesty, echoed the hills. Refreshing, whispered the summer breeze Mellow. Evocative. Crackled autumn’s leaves So, deep within the inspiring woods I scribbled and scrawled and hastened To proudly dedicate my poem... All nature burst into splits! Oh, you poor nitwit! The soul of nature cannot be conveyed Except with the breath of immortality! English Original: Shernaz Wadia Indian

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDMmA7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి