"నాకది చాలు" రచన:ఇమ్రాన్ శాస్త్రి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కాలమంతా గడపొద్దు.. పగలంతా నిను వెతికే కనులకు ఎదురైతే చాలు....! గుండెల్లో గుసగుస మని పలికే భావాలన్నీ చెప్పొద్దు.. పెదవంచున మౌనం దాచిన మాటెంటో పసిగడితె చాలు...! ప్రతి నిమిషం వెనువెంట తిరిగే నీడలా మారొద్దు.. నీ వెనక నడిచేటప్పుడు నా వైపు చూస్తే చాలు...! నీ ధ్యాసలో పడి నే మరచిన నన్ను., నువ్వు గుర్తించొద్దు... నీకంటూ ఏమి కాని నేను నీకై ఉన్న వాడిలా గుర్తుంటే చాలు....! నే రాసే ప్రతి లేఖకి బదులివ్వకపోయినా పర్లేదు.. అవి చేరలేనంత దూరంగా నీ చిరునామ మార్చకుంటే చాలు...! బ్రతుకంతా నీ జతలో ఉండాలనే ఆశకు ఆయువు పోయద్దు.. కను మూసిన నా కథ విన్నాక నీ కంట కురిసే ఒక్క కన్నీటి బొట్టు చాలు...!
by నేనే ఇమ్రాన్ శాస్త్రి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOjeXS
Posted by Katta
by నేనే ఇమ్రాన్ శాస్త్రి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOjeXS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి