పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఐడెంటిటి// ఎలా చెప్పాలి ఎలాగోలా చెప్పాలి ఎలాగోలా అనేకంటే నీకు నాకూ మధ్య ఏమీలేదని చెప్పేసుకుందామా మనం అంటే వర్మనే అడగాలంటే నేనేం చెప్పగలను? అంతరాలయంలో దాగిన మట్టి వేళ్ళను చూపనా? అనంత సౌధమై వెలుగుతున్న పచ్చని చెట్టును చూపనా ? మనం అంటే లోపలా బయటా ఒకటేనని మర్మం ఒకటి విప్పనా ఓహో అదన్నమాట చిత్తం మనం, మనం ఎలాగయ్యామన్నదే ఈ లోకానికి ఓ సందేహం ప్రియతమా నీలో నాలో దాగిన దుఃఖం చాలదూ మనం మనం అని చాటడానికి పిచ్చిలోకం దానికీ తెలుసు దుఃఖం దుఖం మధ్య అగాధం సంతోషం దాని లోతులు దాపరికాలు తొలగాలంటే తానూ శిఖరం నుంచి రాలిపడాలని రాలిపడిన పువ్వు ఒక్కరోజూ నవ్వలేదు బాల్యాన్ని గుర్తు చేసుకుని ఏడ్వనూ లేదు నిర్వేదం అనుకున్నారంతా కానీ, రాలిన పువ్వుదొక తన్మయం. అమ్మ ఒడిలో జోల పాట వింటున్న సంబరం ఈ సంబర సందర్భం మనకొక ద్వారం తెరుచుకొన్న మనో:కుహరం మనల్ని తమలో కలుపుకోలేని తమకాలకి ఆలింగనాలకూ, కర స్పర్శకూ అందని ప్రపంచానికి మనం ఒక నువ్వూ , ఒక నేనూ... మనం దాపరికాలు లేని నగ్నవనం దేహాలు మిగుల్చుకున్న మనస్సులం అర్ధరాత్రి కట్రాడు తెంపుకుని వీదినపడ్డ లేగదూడలం మనం రాత్రుళ్ళు పశుపక్షాదుల మెరిసే కన్నులం చీకటికి అలవాటు పడ్డ కళ్ళు అద్దరాత్రి రాసుకునే కవిత్వం తెల్లవార్లూ తలచుకునే తన్మయత్వం... 22/03/2014

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDMks5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి