పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Kavi Yakoob కవిత

"మిత్రులారా ! 'కవిసంగమం'లో రాస్తున్న కవిత్వం చూస్తుంటే కొన్ని మాటలు చెప్పాలనిపించింది. # కవిత రాయగానే వెంటనే పోస్ట్ చెయ్యకండి.కొంచెం మరొక్కసారి చూసుకుని ,ఏమైనా మార్చాలనిపిస్తే లేదా ఎక్కడైనా భావం చెప్పేటప్పుడు అది పాఠకుడికి చేరే దశలో అర్థం సరిగా చేరుతుందా లేదా అని ఒకసారి ఆలోచించి తిరగారాయండి. # కవిత్వంలో గాఢత అవసరం. మనలోకి ప్రసరించిన అనేక విషయాలను వడపోసి ,చిక్కబరిచి చెప్పే ఒకానొక ప్రక్రియ. వ్యర్థపదాలు,పునరుక్తులు లేకుండా ఒక భావాన్ని అనుభూతిప్రధానంగా చెప్పే ప్రక్రియ.కాబట్టి కవిత్వనిర్మాణంలో అత్యంత శ్రద్ధ కనబరచండి. # కవిత్వం విరివిగా చదవండి. కవిత్వ సంకలనాలు సంపాదించి చదవండి.కవిత్వానికి సంబందించిన పుస్తకాలు చదవండి.అధ్యయనం చాలా అవసరం. # ఎవరైనా మీరు రాసే కవిత్వం పైన తగు సూచనలు చేస్తే,వాటిని వినమ్రంగా స్వీకరించండి. అది మీ ఉన్నతికి,కవిత్వ ఎదుగుదలకు ఉపకరిస్తుంది.[మేం ఏం రాసినా అదే గొప్ప, దీనిపై ఎవరూ ఏం చెప్పక్ఖర్లేదనే భావనను పెంపొందించుకోకండి .కవి ఎంత ముఖ్యుడో ,పాఠకుడూ అంతటి ముఖ్యుడే.పాఠకుడు లేకపోతే కవిత్వం చేరేదేక్కడికి? కవి -> కవిత్వం->పాఠకుడు =ఈ క్రమాన్ని గుర్తుంచుకోవాలి ] # కవికి తనదైన ఒక సొంత గొంతు,మార్గం ఉంటుంది.దానిని వీడకుండా మీదైన ఒకానొక ప్రత్యేక పద్ధతిలోనే మీరు రాయండి.మీరు మరొకరిలాగా రాయకండి.ఒకే వస్తువును ఏ ఇద్దరూ ఒకలా రాయరు. ప్రతి ఒకరికీ తమదైన శైలి ఉంటుంది. # ఫేస్ బుక్ లో 'కవిసంగమం' చేస్తున్న పని - ప్రతి ఒక్కరిలో ఉన్న కవిత్వం రాయాలన్న కాంక్షను గౌరవించి, వారి రాతలకు వేదికలా నిలబడటం.అలా రాస్తూ రాస్తూ కవిత్వసృజనలో పరిణతిని సాధిస్తూ ఉండటాన్ని ,నిండుమనసుతో స్వాగతించడం ,సంతోషించడం. 'కవిసంగమం' చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం కవిత్వం మీదున్న ఇష్టమూ, అభిమానం వల్లనే. ! అందువల్ల 'కవిసంగమం' నుండి ,ఇతర కవిమిత్రుల నుండి ఏవైనా సూచనలు,అభిప్రాయాలు చెబుతున్నప్పుడు ,వాటిని గౌరవిస్తూ పాటించడానికి ప్రయత్నిచండి. ఇదంతా మనందరి కవిత్వం కోసం, కవిత్వం రాసే మీ కోసం ! జయహో !'కవిత్వం కావాలి కవిత్వం !! "

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOjgiu

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి