పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Jyothirmayi Malla కవిత

|| జ్యోతిర్మయి మళ్ళ|| ఊరికొక్కరు వీళ్ళు... మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు ప్రతిభుంటే సరిపోతుందా నాలుగుగోడలు చూస్తూ అది బతికేస్తుందా ఎంత కోరిక ఎంత తపన ఎంత శోధన ఎంత సాధన ఎన్నుండీ ఏంలాభం ఎత్తుకెత్తే మెట్టు దొరకక? మన ఇల్లు మనం కట్టుకోగలం గానీ విజయశిఖరానికి ఎక్కించే మెట్లు మనం కట్టగలమా అవి ఎవరో కట్టిపెట్టాలి మొదటిమెట్టుమీద మనల్ని నిలబెట్టాలి ఒకో మెట్టూ ఓ విజయానికి పునాది రెండో విజయానికి స్ఫూర్తి అదిగో అలాంటి కట్టుడు పనిగాళ్ళే వీళ్ళు.. మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు కాళ్ళు మొక్కాలనిపించే కళాపోషకులు ఎక్కేందుకు కాదు వారి శ్రమ ఎవరినో ఎక్కించేందుకు వీరి స్వేదం ఎవరికో శీతలపవనం వీరి ఆరాటం ఎవరికో ఆనందం వీరి కష్టం ఎవరికో ఫలితం వీరుకట్టిన మెట్లమీంచి ఇంకొకరు ఎక్కడాన్ని చూస్తూ పడుతున్న చమటని తుడుచుకోడం మర్చిపోయే సహృదయత్వం గెల్చినవారి ఆనందాన్ని తమ ముఖాల్లో వెలిగించుకునే సున్నితత్వం నిస్వార్ధం వీరి రక్తంలో దూరి ప్రవహిస్తుంటుంది మానవత్వం వీరి అడ్రసు వెతుక్కుని నివసిస్తుంటుంది వీళ్ళే..ఆ మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు ఊరికొక్కరుంటే చాలనిపించే దేముళ్ళు ! (సూర్యపేటలో నా గజల్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు సోదర సమానుడు శ్రీ Ganesh Peddireddy గారు పడిన శ్రమ ను చూసినపుడు కలిగిన భావావేశం ఈనాటి ఈ కవిత నా గజల్ ప్రయాణానికి దారి చేసి ఇలాంటి మేస్త్రీలు..శ్రీ కొమ్మోజు సత్యనారాయణ గారు(కొసనా, విశాఖ), శ్రీ Kranthi Srinivasa Rao గారు (ఖమ్మం), శ్రీ Peddireddi ganesh గారు (సూర్యాపేట), శ్రీమతి Hema Valluri గారు..ఇలా ఎందరో..అందరికీ ఈసందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి)

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpns1H

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి