నేను మరణిస్తాను || డా// కాసుల లింగారెడ్డి || 06-05-2014 నేను మరణిస్తాను ఓ నా చిన్ని ఖగోళ శాస్త్రజ్ఞడా! నీకు తెలిసిన ఒక నక్షత్రాన్ని వెదికి దానికి నా పేరు పెట్టు నేను నీ జీవితాకాశం మీద వెలుగులు చిమ్ముతూవుంటాను నేను నిన్ను మరిచిపోనూ లేదు అట్లా అని అనాథను చేయనూ లేదు అసలు బాధ్యతను విస్మరించనూ లేదు ఉజ్వల భవిష్యత్ చిత్రపటము దగ్ధమైనందున బతుకు మసిని పోగుచేసుకుంటున్నా రసికారుతున్న రాచపుండు అనుబంధాలకు విస్త్రుత శస్త్రచికిత్స చేస్తున్నా నువ్వు నా జీవన ప్రత్యూష ప్రజ్వలానివి నేను నీ పుట్టుకతో,బాల్యంతో పెనవేసుకున్న పేగుబంధాన్ని నేను నిష్క్రమిస్తాను విశాల ఆకాశం మీద నువ్వొక నక్షత్రాన్ని ఎన్నుకో దానికి నా పేరు పెట్టు నీరవ నిశ్శబ్దంలోను నిబిడ గాఢాంధకారంలోను నేను నీ మీద వెలుగులు ప్రసరిస్తూవుంటాను నువ్వు నా కలల సాకార రూపమౌతావు. డా|| కాసుల లింగారెడ్డి 6 మే2014 సెల్: 8897811844
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdevAf
Posted by Katta
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdevAf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి