|| అడిగోపుల వెంకటరత్నమ్, (తిరుపతి) ||అందిన ఆయుధం|| Posted on: Wed 07 May 00:02:08.082753 2014 సొంత సంతకం కోసం స్వాభిమానం కోసం సమాజ సంక్షేమం కోసం అహర్నిశలు పోరాటం తామరాకుపై కదలాడుతూ ఉంది నీతి నీటి బిందువులా - మాట మాట్లాడుతూ ఉంది హింస విధ్వంస గానం మనిషి పాత్రలు నవరాత్రులు! చూపు చూస్తూ ఉంది కామం క్రోధం కవలలయ్యాయి మనిషి నటిస్తున్నాడు! నడక సాగుతూంది స్వార్థం కపటం సంగమించాయి మనిషి దారి తప్పాడు! కత్తికి ఖండించటమే తెలుసు ధరించిన వాడి నైపుణ్యమే న్యాయం ధర్మాధర్మాలు తెలియవు! నన్ను నేను ప్రదర్శిస్తే నా చిరునామా చెదిరిపోతుంది నన్ను నేను దాచుకుంటే నా చిరునామా దుఃఖిస్తుంది! దేశం ప్రవాసమైంది బతుకు అగాథమైంది ఒకడు నొసట రాతలు రాస్తుంటాడు ఒకడు అమలు జరుపుతుంటాడు! ఓటు వజ్రాయుధం ఎక్కడ శచీపతులు ఓటు యమపాశం ఎక్కడ దండధరులు ఓటు పాశుపతాస్త్రం ఎక్కడ సవ్యసాచీలు ఓటు రామబాణం ఎక్కడ శ్రీరామ చంద్రులు? ఎన్నుకోండి ధర్మాన్ని మూర్తీభవించిన మానవత ప్రత్యక్షం ఎన్నుకోండి న్యాయాన్ని జాతికి దక్కుతుంది నీతి సాన్నిధ్యం!
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaMAvL
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaMAvL
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి