అనవసర ఆవేశాలతో , అహంకారాలతో మీ స్వంత జీవితాలు కూలదోసుకోవద్దు పొరపాటులు మానవ సహజము సహనం తో వాటిని అర్ధం చేసుకోవాలి చదువు సంధ్య లేని మనుషులు కూడా ఎంతో సుఖం గా జీవించారు గతం లో మంచి చదువులు చదువుకుని కూడా భాగస్వామిని అర్ధం చేసుకోలేని జ్ఞానం ఎందుకు ?? గతం లో వివాహానికి అబ్బాయి ,అమ్మాయి జాతకాలు , అలవాట్లు తెలుసుకుని పెద్దల మధ్యవర్తిత్వం లో పెళ్ళిళ్ళు చేసే వారు నేడు చదువులు చూస్తున్నారు అర్హత సమానం గా వుండాలి ఉద్యోగానికి దరఖాస్తు లాగా ఇది వ్యాపార సంబంధం అయిపోతోంది . పెద్దల ఆలోచన మారాలి పిల్లల తెలియని సమాజ పోకడలకు సై అనకూడదు చాలా మంది చదువుకున్న అమ్మాయిలూ సర్దుబాటు చేసుకోలేక సతమత మౌతు చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వివాహానికి కావలసినది మంచి మనసు అర్ధం చేసుకునే మంచి మనిషి పిల్లల్లు నూరేళ్ళు సంతోషం గా వుండాలి అంటే వివాహం ఉద్యోగ వేట లా ,వ్యాపార ఆట లా చూడవద్దు అన్నీ బాగుంటే అందరూ మేదావులే బాధ పడే తల్లితండ్రులను చూసి బాధ తో మీరు ఆ జాబితాలోకి రావద్దు పెద్దలారా ... ఆలోచించండి !!పార్ధ !!07/05/14
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s3en1C
Posted by Katta
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s3en1C
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి