//పిచ్చుక// మరుగైపోతూ మా మంచి పిచ్చుక అరుదైన జాతిగా మిగిలి పోతావా సాంకేతికత నీ పాలిట శాపమయ్యిందా ఆధునికత పుణ్యమా అని అంతరించిపోతావా చిన్ననాటి మా ఆప్తనేస్తం నీ కిచ కిచలు మాకింక వినిపించలేవా అద్దంపై ముక్కుతో గుచ్చిన చుక్కలు చెరిగిపోనీ గుర్తులుగా మిగిలాయి నాడు పిచ్చుకపై బ్రహ్మస్త్రం అనేవారు నేడు నీపై మానవాస్త్రం సంధించినారు సెల్ టవర్లు నీపాలిట మ్రుత్యుకుహరాలు నీ జాతి అంతానికి అయినాయి మార్గాలు తల్లి బందం అంటె పిల్లలకే చూపినావు ఆహారం తినిపించిన చర్యలే సాక్ష్యంగా విశ్వాసానికి చిహ్నంమైన పిచ్చుక అమాయకత్వానికి నిదర్శనం శతాబ్దాలుగా చేసిన సహజీవనం మిగిలి పోనుందా మాకు జ్ఞాపకంగా అంతరించిపోకుండా కాపాడుకుందాం ప్రయత్నం చేద్దాం అందరం అవసరంగా (మేమూ పెంచుకుంటున్నాం మా బాల్కనీలో ఓ పిచ్చుకల జంటని) .....వాణి కొరటమద్ది , 7 may 2014
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5L6Ga
Posted by Katta
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5L6Ga
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి