వేయబోవని తలుపు తెరువేదిరా వేసిన తలపుల తలపులట్నే వున్నాయి కనురెప్పలవంతెన మీద ఎవరు నింగికి నేలకు మధ్య మసకచీకటి కప్పుకుని వొణుకుతున్న పెదవుల మీద పిలుపులెవ్వరికొరకు శ్వాసలో ఎవరి పాటలవీణాతంత్రుల మంద్రస్వరాలు ఊపిరి కొట్టుకుంటున్న పిల్లనగ్రోవి గాయాల పైన ఎవరివి వేళ్ళు నేనిక్కడే నాలోపలే టపటప రాలే కన్నీటిరాట్నమై కదలలేని బెంగ, కనపడవేమని వెతుకులాట మనసుపొరల్ని తరిగిపోసుకుంటూ నీ బొమ్మకై తండ్లాట నా చుట్టూరా నువ్వే కొండవాగువై గలగల నవ్వుతూ నన్ను చుట్టుకుని నీ వాసనలే పూలతోటలై కమ్ముకుని నాకేమీ తెలియనీయని నిశ్శబ్ద నిరీహలు పాటనై ఎగిరిపోయినంతదూరం ఎంత సంతోషం నీ రాగసూత్రాలు నన్ను తాకి వున్నంతకాలం దేహంలో దేహమై, మోహనాంతర స్నేహాంతరంగమై ఆత్మీయుడా, నన్ను ఎక్కడికీ కదలనీకు నీ ఒడిలోనికి తప్ప
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fSNRrY
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fSNRrY
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి