పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మే 2014, బుధవారం

Aravinda Raidu Devineni కవిత

అపసవ్యం ఓవక్త...మానవమేథస్సును,శక్తిని,మానవత్వాన్నిగూర్చిఅనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు.... ఎవరెస్టుపై జండా పాతిన పర్వతారోహకుడు క్రమంగా దిగుతున్నాడు... తమబంధువు ఉసురు తీసిన కల్తీఔషధాలను ఓనిర్భాగ్యుడు శాపనార్థాలుపెడుతున్నాడు.... ఓకాకి మరణిస్తే తల్లడిల్లిన సహచరకాకులు భీభత్సాన్ని చేస్తున్నాయి. ఓతల్లిశునకం పిల్లిపిల్లకు ఆప్యాయంగా తనపాలనిస్తోంది డబ్బులివ్వలేని పేదరోగిని ఆసుపత్రిసిబ్బంది చెట్టుకిందికి ఈడ్చేస్తున్నారు నిర్ధాక్షిణ్యంగా... ఒంటరియువతిని తుంటరులు కొందరు నడివీథిలో వేధిస్తూ ఆనందిస్తున్నా న్నారు. క్రమక్రమంగా స్పృహను కోల్పోతున్నప్పటికీ వరాహం తన గుడిప్రదక్షిణ మానడంలేదు శిలామయ విగ్రహపు కనుకొలకులనుండి అభిశంసనాపూర్వక వేదనాభాష్పాలో అభినందనాపూర్వక ఆనందభాష్పాలో తెలియని కన్నీటిబిందువులు మాత్రం జాలువారుతున్నాయి.

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fTWdiY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి