పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఏప్రిల్ 2014, బుధవారం

Abd Wahed కవిత

గాలి గాలి వెంట వేలు పట్టుకుని నడిచాను జలతారులా పెనవేసుకున్న హాయి భారాన్ని మోస్తూ గాలికౌగిలి భారమే... అరవయ్యేళ్ళుగా నా మెదడులో ప్రతిష్ఠంచుకున్న శిలాసౌందర్యం చెక్కుచెదరని గాలిమేడ... ఐదేళ్ళకోసారి గాలిముద్దులకు పెదాలపై ఎడారి విస్తరిస్తోంది... కంటిలో ఆశ కొడిగడుతోంది... గాలి కౌగిట, ఉక్కుభీముడిలా ముక్కచెక్కలైన కలల అవశేషాలు చీకటి చెలమల్లో చెల్లాచెదరు... ఇంకా గాలికౌగిటి వాసన పోలేదు భ్రమల చేతులు వీపును తడుతున్నాయి.. కలల తునకలు నేలరాలుతున్న సంగీతం వింటూనే ఉన్నాను.. గాలికౌగిట పట్టిన చెమట ఆరేలా లేదు.... శాంతికపోతంలా ఆకాశంలో ఎగురుతోంది గాలి చకోరపక్షిలా శాంతి కోసం నేలపై నేను... మళ్ళీ ఐదేళ్ళ విరహం ఒక మహోత్సవం లాంటి మరో కౌగిలి గాలులు వీస్తూనే ఉన్నాయి... రంగు రంగుల గాలులు ఎన్నటికీ మారని మట్టిరంగులా నేను...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDuSUr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి