శ్రీయుత శ్రీరంగం రెండక్షరాల అరుణం రెండు శకాల కవనం రెండు జీవుల అంతర్నేత్రం.. సగం చచ్చిన సోమరిపోతులకు .. మరోప్రపంచపు అంచులు చూపి.. దారి తప్పిన బాటసారికి చుక్కానై.. భువన ఘోషకు వెర్రిగొంతుక అరువిచ్చి జయభేరీ..గంటలు..గంటలు మ్రోగిస్తూ..మ్రోగిస్తూ..మ్రోగిస్తూ ఆకాశదీపపు మిణుకులు కన్నుల నిల్పి.. దిక్కులు పిక్కటిల్లగా ఋక్కులు చెప్పి అందరిచె కలం పట్టించిన మహనీయ మూర్తి..! నీ మార్గం అనితర సాధ్యం.. అవతారం అది మాత్రం అద్వైతం అక్షర సత్యం.. శిశుర్వేత్తి గానరసం మీ కవితాధారం వార్ధక్యపు నలిగిన ముడతకు జీవం మీ ఆవేశం సాహసిని నిద్రలేపుతూ.. ..పోతేపోనీ.. సతుల్ సుతుల్..హితుల్ అంటూ కళకు ధైర్యం నూరి.. బలిసినవాడికి గోరీకడుతూ.. బక్క వాడికి- అభ్యుదయపు ఘోషలు వినిపిస్తు.. నిశ్చల నిశ్చితాల వడ్డించిన విస్తరి జీవితాల ను నిలదీస్తూ.. మాయ మిథ్యా అనే వేదాంతిని నిగ్గదీస్తూ.. కాలువ కట్టిన ఘర్మజలానికి అంజలి ఘటిస్తూ.. మన బ్రతుకూ ఓ బ్రతుకేనా.. అని ఛెళ్ళున చరిచి, కవిత..కవిత ల కాలువకట్టి.. రస సేద్యం చేసిన రవి.. పవీ..కవి.. నవ కవితకు సింధూరం నీవై.. దగాపడిన తమ్ములకై.. జగన్నాధ రధచక్రం ..ఇరుసు నీవై.. స్వర్గాన్ని కరిగించి.. స్వప్నాలను పగిలించి పద్యమై.. వాద్యమై ..వైప్లవగీతం వీవై పేదల గుండెల.. చీకటి లో ఆకటితో ప్రాకులాడి.. ఆక్రోశిస్తూ.. ఆలోచిస్తూ.. వెదుకుతూ.. వెర్రివవుతూ.. తపించి.. తలంచి.. తరించి.. జ్వాలాతోరణమై.. రణం..రణం.. నీ పదం పదం వెర్రి కుర్రవాని.. ఊరు దిష్టిబొమ్మని దూనమాడి.. రక్తంతో తడిసిన దేశచరిత్రల ఆచ్ఛాదన..తొలిగించి.. గర్జిస్తూ.. గాండ్రిస్తూ.. కేక లేస్తూ.. శ్రమిస్తూ.. హలమై, స్వేద జలమై.. యువక నరమై.. పేదల గుండెవై తెగిన బ్రతుకుల వెలుగు దివ్వై సాధు తత్వపు ఆశలో.. అశయాలలో.. సత్యమై .. నిత్యమై.. నిత్యమై.. సత్యమై .. నిత్యసత్యమై.. బహుళ పంచమి నాడు నిశీధి నీడలలో.. గొంతు చించుకు అరచినా వినలేని.. వినికిడి లేని.. నిద్రనటించే జనసమూహం పై విసిగిన ప్రాణి వై .. వడివడిగా మరేడకో .. రవి తేజములలరగ .. నిప్పులు చిమ్ముకుంటూ వెళ్ళిపోయావు కదయ్యా.. ఓ బ్రహ్మశ్రీ.. శ్రీశ్రీ.. నీ కవితలో కలిసి పోతిమి.. కరిగి పోతిమి.. మమ్ము మేము మరచి పోతిమి.. మహాప్రస్థనం తో జాగృతమైతిమి.. అభ్యుదయం నీ ఆదర్శం అరుణోదయం..నీ ధ్యేయం మేల్కొలుపు నీ ఆరాటం నిత్యనూతనం నీ భావరాజసం జయహో.. ఆంధ్ర తేజ జయహో .. ఆంధ్ర కవిరాజ - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 30.04.2014 (నూట నాలుగు వత్సరాల క్రితం పుట్టిన ఓ కవితా సంద్రానికి.. కాస్తంత అంజలి ఘటిస్తూ... శ్రీశ్రీగా పిలువబడే శ్రీయుత శ్రీరంగం శ్రీనివాసరావు 104 వ జయంతిని పురస్కరించుకుని.. ఆమ్మహాత్మునికి కరణం అర్పించిన ఓ చిరు పుష్పం..)
by Kalyan Krishna Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHTdWm
Posted by Katta
by Kalyan Krishna Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHTdWm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి