పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Wilson Rao Kommavarapu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Wilson Rao Kommavarapu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మే 2014, ఆదివారం

Wilson Rao Kommavarapu కవిత

//////////కొత్త పొద్దు//// 04.05.2014 ప్రాధేయ పడటమెరుగని ప్రభాత కిరణమొకటి నా నుదుటిని ముద్దాడి చైతన్యమై జీవన నాళికైంది అరుణారుణ మహోదయమైంది. అహమంటే ఎరుగని వాసంత సమీరమొకటి నా మేనుని స్ప్రుశించి సమదర్శన కావ్యమై మానవ వికాస చరిత్రకు నాందీ వాచకమైంది. నిత్య సంచలన పరిమళ రాగమొకొటి తీగ తెగి నా మనో వాకిలిని తాకి ఘనీభవించిన కాలానికి అనిర్వచనీయ వాసనలద్ది అనంత శూన్యానికి ఆకుపచ్చ వర్తమానమైంది వర్ణ శాసనాలెరుగని పంచభూతాలు గాయపడ్డ గేయాలై ప్రాణశక్తి నుండి పెల్లుబికిన పరిస్కార గీతాలై నా ఒడిలో తత్వగీతాలు పాడుకుంటూ కొత్తపొద్దును వాగ్దానం చేస్తున్నాయి.

by Wilson Rao Kommavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHyK3i

Posted by Katta

30, ఏప్రిల్ 2014, బుధవారం

Wilson Rao Kommavarapu కవిత

జీవన లిపి // 30.04.2014//కె.విల్సన్ రావు -------------------------------- ఆశల్నొదులుకుని ఆశయాల్ని భుజనేసుకున్నామని నమ్మబలుకుతూ పసిగట్టలేనంతగా మన సజీవ దెహాల్లోని ఒక్కొక్క అంగాన్నీ కత్తిరించి బతుకుల్ని అంధకారంలో తోసే అరాచకీయులు మన జీవితాల్ని బాగు చేస్తామని వాగ్దానాలు చేస్తుంటే నమ్ముదామా..? నయవంచకులు నయా వంచకులై మన దేహ నదుల్లో జలకాలాడాలని చూస్తున్నారు- నిరంతరం మన మెదడును చెంచాలు చెంచాలుగా నంజుకు తినడమే అజండాగా అన్ని రకాల జెండాల్ని మార్చి మార్చి మోస్తూ ధన నిషాలో సుఖాల్ని అనుభవించే గండు చీమలకు " నో టా " చెబుదాం! మన కస్టాల్నీ, కన్నీళ్ళనీ గుర్తెరిగి దు:ఖ మూలాల్ని తెలుసుకుని తనని తాను దానం చేసుకుంటూ మనిషి పాదముద్రల్ని కాంతిమయం చేస్తూ ప్రయాణిస్తున్న రాటుదేలిన ఆలోచనాపరుడ్ని నమ్ముదాం... మనకోసం గంధం చెక్కలా అరిగిపోతూ చైతన్యపు గొడుగును తలపై నాటుకుని జనవాహినిలోకి ప్రవహిస్తున్న వివేచన జెండా ఆసరాతో.. మనకు మనం అసహనపు ముసురులోంచి విముక్తులమై జీవన సత్యాలను విప్పి చెప్పే పరాధీనతకు లొంగని మానవాయుధాలమవుదాం. సజీవ అలంబనైన మనసున్న ఆత్మ విశ్వాసిని ఎన్నుకుని ఒక వినూత్న జీవన పరిమళ సూర్యోదయాన్ని కలగందాం...

by Wilson Rao Kommavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n0Glej

Posted by Katta

18, మార్చి 2014, మంగళవారం

Wilson Rao Kommavarapu కవిత

ఒక రసవద్గీత----కె.విల్సన్ రావు/89854 35515 సాహితీ గవాక్షం/17.03.2014(సోమవారం) మనం ఒకరికొకరం దగ్గరవుతూ నిరంతరం ప్రేమించుకుంటూనే వుంటూ విప్పారిన మనసులతో పరవసించిపొతూనే వుంటాం గుప్పెడు జ్ఞాపకాల్ని ఒలుచుకుంటూ, ఒంపుకుంటూ నిత్య వ్యవహార వలయాల్ని ఛేదించుకుంటూ ఎన్నెన్నో మజిలీల్ని దాటుకుంటూ ప్రేమకంటే తీయనిదేదీ లేదని ఆఖరి ప్రకటన వెలువరిస్తాం అదేమి చిత్రమో గానీ! కలుసుకోవాలని ఆరాటపడే మనల్ని శాసిస్తూ, అదిలిస్తూ కాలం నిర్దయగా వెంటాడుతుంది రుజువుల్లేని ప్రేమల్కి సమస్యల సుడిగుండాల్ని సృష్టించి వద్యశిలపై నిలబెట్టి వసంత రుతువుని మింగేస్తుంది మోహం, వాంఛా లేని ప్రేమంటే ఒక వెలుతురు జలపాతం- ఒక లాలిపాట అనేక జీవితాల రసవద్గీత ఏడు రంగుల పరీమళాల కాంతిపుంజం! ప్రేమంటే - మనసుల మద్య విభజన రేఖను తుడిచేసి కొత్త చిగుళ్ళతో చిగురిస్తున్న మోడుకి మొక్కటం. *** *** ***

by Wilson Rao Kommavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ojaEgA

Posted by Katta