పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మార్చి 2014, గురువారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం|| పదవి రాదని - పరువు కోసం ప్రజల సైతం- మభ్యపెట్టి లాభ నష్టపు - లెక్కలేస్తూ గోతికాడి - నక్కలాగ అదునుకోసం - ఎదురుచూసే దొంగచూపులు - పట్టుకుని చేరేదీసే - బుజ్జగింపులు .1 ఇంతకాలం - అంటకాగి కొంతమూల్యం - వెనకవేసి కంటకాలను - తాళలేక సొంత గూటిని - కూల్చివేయ పరుల పంచకు పరుగులిడుతు గొర్రె దాటు సాకుల వెన్నుపోట్లు! .2 తెలిసి తెలిసి బూదిలోనె పడుకొనే కుక్కవోలె ముక్కచూసి తోకవూపులు మొక్కవోని నమ్మకాలతో చొంగకార్చె కేతిగాళ్ళు ఎన్నికల కలలలోనే పగటివేషగాళ్ళు ఎన్నికలవేళలోనే మన్నికైన నృత్యాలు ఖర్చులేని వినోదంనీలి చలన చిత్రం! కొత్తబిచ్చగాడు పొద్దెరుగని చందాన ఎక్కే గుమ్మం - దిగే గుమ్మం! ఎక్కడో పడతాడు తాతీసిన గోతిలో కోలుకోలేని మచ్చలా! మిగిలిపోతాడు! 3. ప్రమాణాలు పాటించడు ప్రణామాలు పెడుతుంటడు! పరిణామాలూహించడు పరిమాణమే హద్దంటడు! .4 నే చెప్పింది వేదంనన్ను అనుకరిస్తే పాపం! మీరెట్టపోతే నాకెందుకు అడ్డదారైనా సిగ్గువదిలైనా గద్దెక్కటమే నా గురి! తెగ బొక్కటమే తదుపరి! .5 చొక్కా మార్చటం చక్కగా యేమార్చటం చెక్కభజన చేయటం తార్చైనా కుర్చీ ఎక్కటం! రానివాడికి చోటులేదు రాక్షసత్వం అబ్బనోడికి రాజకీయ మనుగడుండదు! .6 27.3.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gEHkQJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి