యాకూబ్ | అదంతా జీవితమేనా ? ........................................ మనమెలా పెరిగాం .నలభై ఏళ్ళ కిందటి మాట అది ! కాలికి చెప్పుల్లేని,చేతికి వాచిల్లేని, కనీసం సైకిల్లేని బాల్యం అది . అవసరాలకు పైసల్లేని కాలం అది .అయినా మనమెలా పెరిగాం. పెరిగామా .నిజంగానే చదివామా .అదంతా జీవితమేనా? తలదిండు లగ్జరీగా నిలదీసిన రోజుల్లో మన నిద్రలన్నీ నిజమైన నిద్రలేనా? కనీసం ఒక్క ప్రేమైనా లేని యవ్వనకాలమంతా వృధాపద్దుగానే జీవితం పుటలో రాసేద్దామా ? రోజుల్ని తపనలతో నింపి,ఎదగడం,అందరిముందు ఒదగడం మెట్టుమెట్టుకీ ఒద్దికగా నిలిచిన ఆ బాల్యమంతా వొట్టి శూన్యమేనా? అయినా మనమెలా పెరిగాం. పంతుళ్ళని 'ఐదు వరహాల'తో ,పిల్లవాళ్ళని 'పప్పుబెల్లాల'తో సంతృప్తి పరిచిన రోజుల్లో చదివిన చదువులు నిజంగానే ఏమీకానీ చదువులేనా? దండించి చెప్పే చదువుల్లో నేర్చిన విద్యలు జీవితాన్ని దండనగానే మిగిల్చిందా? నడిచి నడిచి కాళ్ళ సత్తువకొద్దీ పరుగెత్తి పరుగెత్తీ స్కూల్ బెల్లుకుముందే చేరుకున్న రోజుల్లో హాస్టల్ పురుగుల అన్నంతో ఆకలిని జయించిన కాలాల్లో ఏ విద్యాసక్తి మనసును నింపిందో ! చదువులతీరూ, పెంపకాలజోరూ కలిసికట్టుగా ఇన్నేళ్ళలో ఇచ్చిన తీర్పేమిటో ! తరగతి గదుల్లో తారుమారవుతున్న ఆసక్తులు చివరికి ఆత్మహత్యల్లానో, అసహనపు వ్యక్తిత్వాలుగానో మారి మర్యాదలు మన్ననలులేని మసకమసక రేపటిలా ఉదయించడం లేదా?! 27.3.2014
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iCuvow
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iCuvow
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి