-ఒక్కటే కావొచ్చు! పదునైన వాక్యమొక్కటే కావొచ్చు జీవితమంతా దారిదీపమై నడిపించడానికి వేకువ కిరణమొక్కటే కావొచ్చు దుః ఖపురాత్రుల చీకట్లను చీల్చడానికి ఆత్మీయతాపూరిత అశ్రుబిందువొక్కటే కావొచ్చు ఒంటరి నిశ్శబ్దానికి ఓదార్పు గీతమై ఊరడించడానికి కడలితరంగమొక్కటే కావొచ్చు కాళ్ళను తడుపుతూ పలకరించడానికి కొంటె చూపు ఒక్కటే కావొచ్చు హృదయాన్ని మధుర కవనమయం చేయడానికి నాదమొక్కటే కావొచ్చు అంతరంగంలో ప్రతి ధ్వనించడానికి అంకురమొక్కటే కావొచ్చు భావాల పక్షుల రెక్కలకు పురుడుపోసే తల్లి చెట్టు కావడానికి అక్షర మొక్కటే కావొచ్చు గుండె కొలిమిలో దగ్ధమై నగలా మెరియడానికి చినుకొక్కటే కావొచ్చు వేదనా మేఘాల్ని చీలుస్తూ వరదై ముసురుకొని ముంచెత్తడానికి కుట్ర ఒక్కటే కావొచ్చు మనుషుల్ని ,మనసుల్ని మూలాల్తో పెకలించడానికి ద్రవించే కారుణ్య బిందువొక్కటే కావొచ్చు నిన్ను దయా సముద్రుణ్ణి చేయడానికి ఆత్మీయతాస్పర్శ ఒక్కటే కావొచ్చు జీవితమంతా అనుభూతుల పరిమళాలతో వికసించడానికి కవిత్వ కరచాలనమొక్కటే కావొచ్చు కోట్ల అశ్రు జలపాతాల్ని అధిగమించడానికి మట్టి రేణువొక్కటే కావొచ్చు మనిషి చరిత్ర లిఖించడానికి ........ డా .కలువకుంట రామకృష్ణ
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pcVcTq
Posted by Katta
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pcVcTq
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి