బహుజన నావికులారా! మీకు మీరే రాజులు! యేరులుగా పారుతున్న దరిద్రాన్ని దారికట్టి సహకరించి నిల్వ కోరు బహుజన నావికులారా! యేరులుగా పారుతున్న దరిద్రాన్ని దారికట్టి సహకరించి నిల్వ కోరు బహుజన నావికులారా! యేదయినా అది సరే, మీకూ వాటా అడుగుతున్న మూర్ఖుల్లారా! ఆరగింపుకు అన్నంచాలు అసిధ్ధం మీకెందుకు? ప్రభుత్వ నిర్మాణానికి యిసుక రేణువులు ప్రజలు ప్రజా రక్తమే వ్యాపక పరివాహక యింధనం పెట్టుబడకి పదిరెట్లుగ పట్టుబడిని తేగలిగిన వ్యాపారాలన్నింటా నేడు రాజకీయమే రాజం! 'తాము ప్రజలు కాదం'టూ వారే ఆసనార్హులు 'తమ రక్తం ప్రజలం'టే అదే వారసత్వం! నల్లధనం, ఎర్రధనం అన్నీ చెల్లే రాజ్యం తెలిసొస్తే తగవుగాని, కలిసొస్తే తిరుగులేదు! జీవితాల కర్ధ మర్ధమేనని తెలుసినోళ్ళు అర్దాకలి ప్రజలంటే వ్యర్ధులనే అలుసు నోళ్ళు గ్రధ్ధల తలదన్నేపద్దును కూడిన మనసు రాజకీయ వాదానికి మతం వారికొక సొగసు! సమైఖ్యపు సంబరం విభజన కొక వితండం ఇసుక మాఫియా మీరే? గనుల తవ్వకం మీదే? ఎర్రచందన బొమ్మ మీరు! దుప్పిమాంసం కొమ్ము మీరు! గంజాయి పొగ రొమ్ములు మీరు! చీకటి కొట్టు అమ్ములు మీరు! కన్నెదార కనులు మీరు! పోలవరం పంటమీరు! జగన్ మాయ జత మీరు! చంద్రుని చంధస్సు మీరు! భంగి అనంత భాగోతం ఆనక్క వివేక వేదాంతం లోక సభను శివనృత్యం నాటకాల చిరంజీవం........! వీరంతా నడుంకట్టి విరగ్గొట్టిందేదీ? పట్టిన దారిద్ర్యానికి చట్టంలో చోటేగదా? కనిపించే కిరణుల్లో అనిపించే కాంతి మీరు దూరపు కాషాయానికి అందని ఆధారం మీరే! బాపనోని చదువు దాటి కమ్ముకొన్న కమ్మదనం కదిరి నరసిమ్హుడి కధతోనే సరి పెడతారా? మొదళ్ళను మీకుంచి, తూడులు తుంపుకు పోతూ, తన్నుకు చావండని తరాలుగ సాగుతున్నకర్కశ యత్నమే ఈ ఆధిపత్య వ్యవసాయం! ఎందుకు మీరూ సాయం? నాలుగు దిశలా నరకులు నడుమ పుట్టినాళ్ళ అరుపులు కాదు మట్టి, దేశమంటే మనుషులు మరి, ఎవరీ దుర్గతికాది పురుషులు? అడవీ, ఆలమందలు అడవిలోని వాళ్ళందరు ఎవరి సొత్తని యీ చిందులు ఎవరి రక్తపుటేరుల విందులు? స్వతంత్ర మెప్పుడొచ్చింది? స్వరాజ్య మెవరి కొచ్చింది? సమస్యసాగిల పడితే సమరం సాకు పెడతారు వుల్లిపాయ వులికి పడితే వుప్పుజల్లుతుంటారు వేమశతకము మనకే రామబాణము మనకే కామసూత్రమని పుట్టిన పాముకాటు విషమూ మనకే! తెల్లవాడి జులుముకన్న నల్లవాడి విషంమిన్న! భూ వాయువు వదల్లేదు జీవజలం మిగల్లేదు దారి మళ్ళిన సంపద ప్రపంచపు పెట్టుబడై పోగా భౌగోళిక సహాయమంటూ భారతాన్ని ముంచుతుంది! సాములోడి కొక దణ్ణం రాములోడి కొక దణ్ణం అడుగడుగున మోకరిల్లి అమ్మగార్ల కొక దణ్ణం! అగుపించెడి సాటి మనిషి ఆలింగన ప్రేమ కదా పరమంటూ ప్రేమకొరకు వరాలిచ్చు దేవుడేల? అన్నార్ధికి భుక్తిచూపు విధమే మనమతం కదా అజీర్ణమే తేనుపుగా తలకెత్తిన తత్వమేల? ఆవు కంటే పెయ్యిని, ఆలి కంటే కొడుకుని కోరే కుమతుల నీతికి చేదోడైన వాదం గో మాత, పురుషోత్తమ వూహ జనిత నినాదం! అన్నీ తెలుసు మీకు, బడుగుల నావికులు మీరు! తిన్నదరక్కపోతే విషం త్రాగిచావొచ్చుగా? తప్పదన్నట్టు స్వజనాలను బందీచేస్తారెందుకు? అనుబంధం చూపలేని మను బంధాలెందుకు మీకు? మీది కాని మతానికి మీరూ సతమతమెందుకు? రాజకీయ వాటా కాదు రాజ్యం నడపాలి మీరు మీలో మేధ లేదని కొందరు మిగులు దాన మిస్తారట! ఎవడబ్బ సొమ్మంటూ ఆటవిడుపు లెమ్మంటూ అధికారం అందుకోండి అదిమీదే, నమ్మిపొండి! అడవినీతి సింహరాజు అసలు నీతి నీకు నువ్వే రాజు!
by Syam Prasad Bezawada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jyWn0q
Posted by Katta
by Syam Prasad Bezawada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jyWn0q
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి