గుబ్బల శ్రీనివాస్ --------।। కొన్ని నవ్వులు కొనుక్కోవాలి ।। అంగడిలో గాలించినా సరే కొన్ని నవ్వులు కొనుక్కోవాలి నవ్వటం మరిచిపోయిన ఈ పెదవుల కోసం . కిలోల కొద్దీ కాకపోయినా కనీసం గ్రాముల్లోనైనా ఖరీదు చేసుకోవాలి గుండెనిండా నిండిపోయే గుప్పెడు నవ్వులని . పొత్తిళ్ళలో ఉన్నప్పుడు అడక్కుండానే అమ్మ ఎన్ని నవ్వులను మూటకట్టి కానుకగా ఇచ్చేదో ! మరి ఇవాలేంటి ? రెండు పదుల వయసులోనే జీవితం ఎడారిగా మారిపోయినట్టు ముఖాన చిరునవ్వుల పరదాలు ఊగవే.. !? వైరాగ్యం కమ్ముకున్నట్టు, ఇక ఏ బాగ్యం దరి చేరనట్టు, మధుమాసం మళ్ళీ రానట్టు ఈ జీవితాలు ఇంతేనా ? నవ్వులు ఎవరి సొంతమూ కాదే ! ఏ హృదయంతరాల్లో బందీ కాలేదే ! మరి నీపై ఎందుకు కత్తికట్టాయి ? ఒక్కసారి నీ మనసుని చుట్టిముట్టిన ముళ్ళ కంచెలను పెకలించి చూడు అక్కడ ఎందుకు తులసివనమై ఆ నవ్వుల మొలకలు మొలకెత్తవో చూద్దాం . జైలుపక్షిగా కాక స్వేచ్చా కపోతానివై ఎగురు దరహాస శిఖరాలు నీ ఆగమనానికి ఎలా స్వాగతం పలకవో చూడు ! (27-03-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dvxksC
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dvxksC
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి