_ మర్మాగారం_ అక్షరాలు తొడగని ఆలోచనలెలా ఉంటాయో తెలుసా? శవాలు కనే కలల్లా , మరాలు దాటని చెరల్లా!! జన్యుపరంగా జబ్బులోస్తాయని శాస్త్రం సంకెక్కినోల్ల సారం నిజమే!! జన్యు పరమైన జబ్బుల్లో అన్నిటికన్నా పెద్దది జన్మే!! కాదు కాదు..జన్మెలా జబ్బవుతుందని ప్రశ్నించి జన్మించినోల్లంతా శాస్త్రాల జల్లెడలో ప్రాణాన్ని పడేసినా ప్రాణమొచ్చేస్తుంది జన్మనొదిలేసి!! తెలుసు జబ్బవ్వని జన్మ బాగుంది..జన్మవ్వని ప్రాణం బాగుంది ప్రాణమవ్వనిదేముందని చెప్పే శాస్త్రమేదైనా బాగుంది!! బాగున్నదంతా బాగుంది..బాలేనిదంతా బాగుంది అసలు బాలేనిదేముంది?? ఉంటే జబ్బున్నట్టే , జన్మ జబ్బైనట్టే జబ్బు కూడా బాగుంది అనేస్కుంటే పోలా!! ప్రాణాన్ని జబ్బనట్లేదుగా!! జన్మకెన్ని జబ్బులున్నా , జన్మే జబ్బైనా బాగుందన్నా, బాలేదన్నా ప్రాణానికంటదు ఏ జన్మా , ఏ జబ్బూ!! అయినా ప్రాణానికి లేని బాగోగుల బాధ అదిచ్చిన జన్మాలకెందుకో ఆలోచనకే తెలియపోతే అక్షరాలకేం తెలుస్తుంది!! ఇంక జడాల గురించెందుకులే అవి ప్రాణానికి జన్మకి ఆలోచనకి అతీతంగా అవసరం లేని ప్రశ్నలకు అర్థం కాని సమాధానాలుగా..గా..గా..గా..... వార్నీ!! ఇంతసేపు చెప్పిందంతా సోల్లైపోయింది జడాలు గుర్తురాగానే జై జడం_________________________________(27/3/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NYMryo
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NYMryo
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి