పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Sasi Bala కవిత

ఎవరు నీవు?............................శశి ............................ ఎవరు నీవు ???? నీవు నాకు ఏమవుతావు? నీకు సర్వస్వము నేనే అన్నట్లు నీ మది తలుపులు తెరచి, వాకిట నిలచి, ఏ మాలిన్యమూ అంటని మధురమైన ప్రేమామృతాన్ని నీగుండెలలో నింపుకుని నా కోసమే పంచడానికి ఎదురు చూస్తున్ననీ కన్నులకు నా రూపమే అపురూపమై జన్మజన్మల అనుబంధమైనట్లు..... గతమంతా మరపించి, మది పులకించిపోయేలా ఎన్ని జన్మలైనా తోడుండాలని కోరే నీవెవరు? పరమాత్ముడి మరో రూపానివా? వలచి వరించ వచ్చిన నీకు ఏమివ్వగలను? నాకున్న ఈ చిన్న హృదయం తప్ప... ఏ బంధాలతోనూ కట్టిపడేయలేని అనుబంధంతో పెనవేసుకున్న నీకు నేనేమవ్వగలను? విశాలమైన నీ హృదయంలో "బందీ"ని తప్ప..... ఈ ప్రశ్నకు బదులు ......... ..................................... నేనెవరో కాదు నీలో వున్నా నీవుని నేను నీ ఊపిరిలో ఊపిరిని నీ కంటిలో పాపని నీకు బాధ కలిగితే నీ కంట నిండే అశ్రువును నీకు మోదము కలిగితే నీ పెదవులపై చిరునవ్వును నీకు ఆవేశం కలిగితే నీ మోమున తోచే అరుణిమను జన్మ జన్మకూ నీతో వుండే నీ తోడును నీ నీడను........22 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mz9srW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి