పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Maddali Srinivas కవిత

కవులకేం ?!! యెన్నైనా చెబుతారు//శ్రీనివాస్//22/02/2014 ------------------------------------------------------------------------------- కవుల కేం యెన్నైనా చెబుతారు! యేమైనా రాస్తారు! కలలన్నీ వెన్నెల్లో తడిపారబోసి అక్షరాలా అమృతాన్ని వొలకబోస్తారు! కవులకేం యెన్నైనా చెబుతారు కాలం కడలిలో మునిగే మా బోట్లకు భావాల తెరచాపల నాధారంగా చేస్తారు ఆదర్శాల దిక్సూచిని చూపించేస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు యెడారుల్లో మల్లెలు పూయిస్తారు మండుటెండల్లో మంచినీళ్ళ వూటలు పుట్టిస్తారు బంజరు భూములన్నిటిని సస్య శ్యామలం చేసేస్తారు చీకటి ఖండాలల్లో వెలుగు పుంతలని పుట్టిస్తారు కవులకేం యన్నైనా చెబుతారు నిజం వేడికి కలలన్నీ కరిగి పోయే వేళ వెక్కిరించే వేదనలకి వేదాంతపు లేపనాలు పూసేస్తారు గాయమైన చోటే గేయాలను పుట్టిస్తారు శిశిరంలో నవ వసంతాన్ని గ్రీష్మంలో హేమంతపు చల్లదనాన్ని శరత్తులో రధ సప్తమి నాటి రవి కిరణాలనీ అక్షారలలో ఆవిష్కరిస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు పగిలిన అద్దాన్ని అతికించాలనో విరిగిన మనసులను ఒకటి చేయాలనో అక్షరాల సంజీవని తో అద్భుత చికిత్స చేస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు కలలతో కడుపు నింపేస్తారు. నిప్పులు కురిపించే ద్వేషపు బడబాగ్నులు చల్లారాలంటే చల్లని కలల సాయం చక్కని కవితా వ్యవసాయం అవసరమే మరి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8lpuz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి