పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Vani Koratamaddi కవిత

మా నాన్న గారు క్రీ.శే. శ్రీ కొరటమద్ది.నరసిం హయ్య గారు రచించిన కవిత ఇది నాన్న గారు కె,యన్.కౌండిన్య అనే కలం పేరుతో కధలు కవితలు రాస్తూ వుండే వారు అప్పట్లొ అవి పెద్దగా ప్రచురణకి నోచుకోలేదు కవి మిత్రులకి పరిచయం చెయ్యాలనే ప్రయత్నం చేశాను . రచన. క్రీ.శే శ్రీ.కొరటమద్ది నరసిం హయ్య గారు. వలపుల వలయంలో వల సాయంసంధ్యా సమయం అది అరుణరాగ రంజిత తరుణం కెంజాయ వలువ ధరించిన సంధ్యా వధూటం దోబూచులాడే చంద్రునికి స్వాగతం పల్కింది తెరమాటుకు తప్పుకుంది వెన్నెల వెన్నెల!! ఎటు చూచిన వెన్నెల! అనుభవింప లేకున్నాను నిరాశాపూరిత ఏకాంతం భరింపరాని వంటరితనం నన్ను వేధిస్తున్నాయ్ క్షణాలు యుగాలుగ నడుస్తున్నాయ్ నెచ్చెలి రాకకోసం నాద్రుక్కులువీక్షిస్తున్నాయ్ ఇంతలో అందాల అరదం వలపుల పూల రధం కళ్ళెంలేని గుర్రాలు భ్రమరాలే పగ్గాలు సుమశరుని సారద్యంలో ప్రేమరధం నాఎదుట నిలిచింది నాలో ఆశలు నింపింది అందులో అందాల రాసి పంచవన్నెల రాణి వలపుల పూబోణి-అలవోకగా నావైపు చూచింది నాలో ఆశలు రేకేత్తించింది నన్నూరించింది నన్నందుకొంది ఆశలు నిండిన హ్రుదయంతో స్వర్గసీమలనేలే ఆశలతో అరదాన్నదిరోహించాను వలపులరాణి సంగాతంలో పయనం సాగించాను ఎటకో ఎటకెటకో!! గమ్యం తెలియని పయనం స్వర్గసీమల్లోనికా? మిన్నంటే కెరటాల సాగరమధ్యంలోనికా ఎటకో ఎటకెటకో!! గమ్యం తెలియని పయనం దశ దిశలా పయనించింది భూమ్యాకాశాలు నాక నరకాలు ప్రణయ ధామాలు ప్రళయ కుహరాలు అన్నింటిని చుట్టేసింది గిరగిరా - గిర గిరాలు చుట్టేసింది అగాధమైన వలయాల్లోకి (పడిపోయింది) పడవేసింది. నామేను కంపించింది నాభ్రమ తొలగింది కళ్లు తెరుచుకున్నాను అటునిటు చూచాను నిజం తెలుసుకొన్నాను వలపు లేదు-వలపులరాణి లేదు అంతాభ్రమ అంతా మృగ్యం మిగిలిందొక్కటే "వలపు"లో ని "వల" అదే నన్నాశా వలయంలో చుట్టేసిన వలపు లేని వల 29/2/1972 హోళికా పూర్ణిమ విరోధికృత. ROBERT BROWINGS "A LAST RIDE TOGETHER" ఆధారంగా

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkoSjL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి