పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Viswanath Goud కవిత

విశ్వనాథ్|ఏముంది నీలో ............ ................. ఆగు నీలోకి చూడాలివాళ నీ మనసు లోతుల్లో ఏముందో తెలుసుకోవాలివాళ క్షణానికోరకంగా స్పందించే నీ గుండె చప్పుల్ల అంతరంగం ఏంటో వింటానివాళ ప్రతిసారి నువ్వు చెప్పే తీపిమాటల మాధుర్యపు ఊట యద లోతుల్లో ఊరిందా, గాలిచినుకులా గొంతు పై నుండి వచ్చిందా తెలుసుకుంటానివాళ కళ్ళలో దాచుకున్న తుప్పెరుగని, చూపుల చురకత్తులు ఏ కమ్మరి సానపట్టాడో ఆచూకీ కనుక్కుంటానివాళ నీ భావాలు తల్లడిల్లిన ప్రతిసారి ఉప్పనలా పొంగే ఆ కన్నీటి సాగరం ఏ ఆవేదన చెందిన మదీ నదుల సంగమమో దూకి చూస్తానివాళ నీ అడుగులు మోపిన మోగే ఆ గజ్జెల సవ్వడులకు సరిగమల స్పందనలు ఏ నాధబ్రహ్మ నేర్పాడో అన్వేషిస్తానివాళ నవ్వినా,ఏడ్చినా ఎర్రబడే ఆ బుగ్గల సున్నితత్వం ఏ పువ్వు అరువిచ్చిందో అడిగేస్తానివాళ అమావాస్యలో కూడా వెన్నెల పండించే నీ నవ్వుల వెలుగుల వెనుక చిదంబర రహస్యమేదో కనుక్కుంటానివాళ కురులను జలపాతాలు చేసి పూలు పండించే ఆ పరిమళాల మహిమ,ఏ వసంత జీతగాడి సేద్యమో అడిగేస్తానివాళ ఆగు నీలోకి చూడాలివాళ నీలో నేనున్నానో లేదో తేల్చుకుంటానివాళ.! 22FEB14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gW3v3d

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి