Si Ra// బండరాయి // 4-6-14 నాకు ఒక మహాత్ముడు తెలుసు, ఓ మెధావి, అది కొండపైన యుగాలుతరబడి ఆలొచిస్తున్న ఓ బండరాయి. కదలకుండా, ఎండనూ వాననూ లెక్కచేయకుండా, దీర్ఘ కాలంగా,ఏ చలించని దేవుడి కోసమో తపస్సు చేస్తున్నట్టూ, ఓ అద్భుత కల మద్యలో నిద్రలేవకూడదు అని బలవంతంగా నిద్రపొతున్నట్లు, విశ్వం గురించి, కాలం గురించి, సత్యం-అసత్యం గురించి ఆలొచిస్తూ అలొచిస్తూ, ఆలొచనల కాలువలో పడిపొయి ఒక గొప్ప సముద్రం లో తన ప్రవాహం కలవాలని, ఆ సంద్రంలో తన ఆలోచన అల అవ్వటం కొసం, తెలియని లోకాలకు నిరంతరాయంగా ప్రయానిస్తొంది, ఆ బండరాయి. ఈ బండ రాయి తన పరిసరాలలోనే ఒక విశ్వాన్ని స్రుష్టించింది, ఎన్నో క్రిములకూ, కంటికి కనబడని జీవులకూ ఆశ్రయం ఇస్తూ; నువ్వు కూడ ఏ బండరాయి కిందో బ్రతుకుతున్న సూక్ష్మ జీవివి అంటూ మానవ విజ్ఞానాన్ని, మానవుని వునికిని వెక్కిరిస్తుంది. రొజూ సాయంత్రం దానిపై నిలబడి సూర్యుడు ఆత్మహత్య చెసుకుంటాడు, దాన్ని చీల్చుకొని నక్షత్రాలు, చెంద్రుడు బయటకి వస్తాయి. ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనేది తప్పు అని నిరూపించటానికి దాని దెగ్గర గెట్టి సాక్ష్యాలు ఉన్నాయ్. దానినీడనే దాని ఆత్మ పగలంతా దానిచుట్టూ తిరిగే దాని నీడ, రాత్రి అవ్వగానే ప్రపంచం అంతా వ్యాపిస్తుంది.
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJCGNq
Posted by Katta
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJCGNq
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి