కె.ఎన్.వి.ఎం.వర్మ//వలస రైలు// ఆగని ఎక్సప్రెసుకు టాటాలు చెప్పి ఆగి వెళ్ళిపోతున్న పాసింజర్ రైలును చూస్తే డిగ్రీల రెక్కలు మొలచి పట్టాలుమీద రైలై ఎగిరేవరకూ.. పల్లెటూరు పిల్లలకి ఎంత దిగాలో కదా! చెమిటోళ్ళ ముందు గుడ్డి బిక్షగాడు పాడే పాట మాఫియా చేతిలో వికలాంగులై చేతులు చాచే పిల్లలు ఒకే పేపరు నలుగురు చదువుతూ ఇరవయ్ రూపాయలకి నీళ్ళ సీసా కొని పోలవరం ముంపు గ్రామాల మీద చర్చించే జనాలు పది రూపాయలకి టీ తాగుతూ విని కాలక్షేపం చేసే కుర్రకారు బెర్తుల కోసం టికెట్ కండక్టర్ బేరాలు ఇంటినుంచి తెచ్చుకొన్న మధ్యతరగతి అల్పాహారాలు మంచినీళ్ళ కోసం వచ్చే స్టేషనుకై ఎదురుచూపులు గమనించి చూస్తే రైలొక మినీ భారతదేశం అనుకున్నంతలోనే అనుకోకుండా నిజానికి ఈ రైలొక అనకొండ ఊళ్ళకి ఊళ్ళని వలస రూపేనా మింగేసి పట్నం బండరాయికి చుట్టుకొని అరగని ఎముకలని మురికివాడలోకి విసిరేసే విషపు నాగు సాగనంపిన రోజు నుంచీ పాసింజరూ ఎక్సప్రెసూ జనరల్ స్లీపర్ ఏసీ అన్నీ పల్లె ఎదురుచూపులని మోసగిస్తూనే ఉన్నాయి బతికుంటేనో బతుకు బాగుంటేనో వస్తాడని చూసిన పల్లె కళ్ళు పత్తికాయల్లా పేలి ప్లాటుఫాం మీద అడుక్కుంటూ స్ధిరపడిపోయాయి అక్కడక్కడా మిగిలిన పల్లె బతుకులు వేరుశెనగ కాయలో బఠానీలో ఏదో ఒకటి ఆ రైలులోనే అమ్ముకుంటూ కాలంవెళ్ళబుచ్చుతున్నాయి ఇప్పటికీ పాలమూరులోనూ విజయనగరంలోనూ రాయలసీమ పల్లెలోనూ నాయకులంతా ఊదరగొడుతున్నారు దేశాన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామని హెలీకాప్టరులో వెళ్ళిపోతున్నారు పల్లెలు ఊళ్ళు, గల్లీలు, కాలనీలు, నగరాలు దేశానికి దేశాన్నే దోచుకున్న దొంగల పోటోలు అతికించాల్సివస్తే ఏ రైల్వే స్టేషన్ ఐనా సరిపోతుందా! వాస్తవానికి పట్టాలు దాటలేని జంతువులుకన్నా పట్టాలు మీద చేసుకున్న ఆత్మహత్యలకన్నా ఈ రైలు మింగేసిన జీవితాలే ఎక్కువ ఈ రైలు పట్టాణాన్ని ప్రేమించే అనకొండ ప్రయాణం తరగని భారతదేశం దేశమంతా రైలు ప్రయాణ అవశేషాలు ఈ వలస రైలు పండగకి గర్బిణి పబ్బానికి అమ్ముకున్న పొలం పొట్టపట్టుకుని పల్లెకువచ్చిన రోజు మాత్రం చరిత్ర పుస్తకం......04.06.2014.
by Nvmvarma Kalidindi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9ULJO
Posted by Katta
by Nvmvarma Kalidindi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9ULJO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి