కె.కె.//గుప్పెడు మల్లెలు-75// ******************************* 1. భోజనం అరక్కపోతే, డైజీన్ గోళీలుంటయిరా, కారణాలు చెప్పాలంటే,పురాణాలే ఆసరా 2. సుఖమైనా,దుఃఖమైనా కన్నీళ్లే, కోరుకోరోయ్ ముందు నెంబరే, టైం మిగులుద్ది, తుడవక్కర్లే 3. కాంతివేగం లేదులే, ఏ చరానికి లోకంలో... ౠజుమార్గం లేని రూమర్లకు తప్ప 4. ఈత రానోడు ఏట్లో పడ్డట్టే, కొత్తగా మనం ఏం నేర్చుకుంటున్నా, గజీతగాడైనా, మొదటిరోజది మామూలే 5. గుడ్డుమార్నింగ్ అన్నమాటే,ప్రతీనోట శుభం ఆడికో, ఈడికో చెప్పకుండా నమస్కారాలు మునిగినట్టున్నాయ్ నట్టేట 6. ఈ ప్రపంచం ఒక నాటకరంగం, మనమంతా పాత్రదారులం, ఓరి దేవుడా! ఏమిటీ చెత్త నటవర్గం. 7. సారాయి మరిగినోడైనా, బారునొదిలేస్తాడేమో కాని, గ్రంధం మరిగినోడు,ఆ బంధం వీడిరాడు. 8. ఒట్టేసి మరీ చెబుతారు అబద్దాలు, అదేదో బులెట్ ప్రూఫ్ జాకెట్లా, నిజం షార్ప్ షూటర్రోయ్, గురెప్పుడూ బుర్రకే 9. మరుపన్నది అలవాటైతే, మంచి సాధన చేసినట్లే... విచక్షణలో గౌరవ డాక్టరేట్ పొందినట్లే 10. విజయం నాదేనంటే... అవకుండానే యుద్ధం, విషయమ్మీద అవగాహన లేదని అర్ధం, దానికి మరోపేరే అహంకారం. ========================== Date: 03/06/2014
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kAInSW
Posted by Katta
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kAInSW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి