అరవిందరాయుడు//విద్వత్తు//18 ***************************** జెన్ కో ట్రాన్స్ కో అనుసంధానమైతే జనం కళ్ళల్లో,జనుల ఇళ్ళల్లో వెలుగు గ్రంథం,గ్రంథాలయం సమన్వయమైతే ఎందరో జీవితాల్లో పున్నమి. అదివిద్యుద్భాష-ఇది విద్వద్భాష రెండూ అంతర్వాహినులే. రెండూ చైతన్య ప్రేరకాలే ఇరుశక్తుల అంతిమలక్ష్యం వెలుగు పంచడమే విద్యుత్ ఇంటింటికీ చేరకున్న అగోచరమే విద్వత్ ఫలం మనిషికీ అందకున్న అగమ్యమే అది వెలుగులో పరిఢవిల్లుతుంది ఇది పలుకులో పరిమళిస్తుంది ఒకటి శబ్ధంలో రాణిస్తుంది మరొకటి నిశబ్ధంలో శోభిస్తుంది రెండింటిమధ్య సామ్యం అనల్పం రెండొంటికీ భేధం అతిస్వల్పం తాత్కాలికమూ,పాక్షికప్రాయమూ పరిమితమాత్రమూ,ఆడంబరాస్పదమూ ఐన విద్యుత్తు అంటే అందరికీఅపేక్షే అది నిత్యావసరమూ,తక్షణప్రయోజనదాయినీ కనుక శాశ్వతమూ,పరిపూర్ణమూ అక్షయతుల్యమూ,నిరాడంబరాస్పదమూ ఐన విద్వత్తు పట్ల అధికులకూ ఉపేక్షే అత్యవసరమైనా తక్షణంఅనుభూతం కాదు కనుక. ప్రతిస్పందనలో ఎంతటి వైరుధ్యం సకల ఆవిష్కరణలకూ మూలం విద్వత్తు. సర్వప్ర'యోజనా'లకూ మూలవిరాట్టూ మేధస్సు విద్వత్తు అనుంగుపుత్రికే విద్యుత్తు దప్పికవేస్తే నీరుకోరడంహక్కు కలుగబోయే దప్పికగూర్చి తవ్విఉన్న నూతిబాగును గూర్చి ఆలోచిండం అందరిబాధ్యత చరిత్ర నేర్పే గుణపాఠాలను నేర్చుకుంటూ సాగాలెప్పుడూ ప్రశ్నార్ధకమైన భవితను మార్చుకొనే దిశలోకి మారాలెపుడూ ****** ******* 04-06-2014
by Aravinda Raidu Devineni
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouMpva
Posted by Katta
by Aravinda Raidu Devineni
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouMpva
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి