చంద్రశేఖర రావు వేములపల్లి || నా జీవన వాసంతం .... ఆమె || వర్షం కురుస్తున్నట్లు ఉరుములు ఉరుముతున్నట్లు ఆకాశం గాలిని పగులగొడుతున్నట్లు మెరుపుల మయమౌతున్నట్లు తలరాతలు మారి అస్తిత్వం, ఉనికి కుదుపులకు లోనై నా జీవితం లో ఒక అమూల్య అవసరం లా పదే పదే కళ్ళముందు కదులుతూ .... ఆమె శాంతి, సహనం, భూమాత రూపం కన్నీళ్ళ స్నానం చేస్తూ నా ప్రతి నిర్ణయం వేడికి పగిలిన గుండె సేదదీర్చే వసంతం లా .... ఆమె ఆ కన్నీళ్ళ అగ్ని జ్వాలలు నా ఆలోచనలను ప్రభావితం చేసినా నా నిర్ణయాల అసంపూర్ణత మాత్రం నన్ను కాల్చేస్తున్నట్లుంటుంది. పిచ్చీ! ఈ అద్భుతం చూడు!? అని బిడ్డతో అమ్మ మాట లా చిరునవ్వు కన్నా బలం గా నాటే ఆ పలుకరింపు లో నన్ను నేను కోల్పోవాలనుంటుంది ఆమె కంట తడి చూసిన ప్రతిసారీ నాతో ఏడడుగులు నడిచి నా గతజన్మ శాపాలన్నీ నాతో పాటు ఆమె మోస్తున్నట్లు .... ఓహ్! అసమంజసం అనుకునేలోగా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఎన్నాళ్ళు జీవిస్తానో కానీ నా పాపాలన్నీ ఇలా, నాతో పాటు ఆమె ఏ పాపమూ ఎరుగని ఆమె కు నా గతజన్మ పాపఫలం నా కష్టాలు, నా కన్నీళ్ళ పంచుతూ నేను క్షమార్హుడ్ని, జీవనార్హుడ్ని కానేమో! 04JUN2014
by Chandrasekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9nniD
Posted by Katta
by Chandrasekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9nniD
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి