సొన్నాయిల నరేష్కుమార్//ఒక సాయిబు కోసం// మిత్రమా...! ఎదురు చూస్తూనే ఉండుంటావింకా ఇస్లాం పేట వీధుల్లో నన్ను వెంటేసుకొని తిరుగుతూండి ఉంటావ్ తననుండి తానే తెగిపడిన స్నేహితున్ని తలుస్తూనే ఉండి ఉండిఉంటావ్ గరుకుగా మనసుని వొరుసుకుంటూ ప్రవహించే నిమిషాల్లో ఒకనాటి మన నవ్వులని కాగితం పడవలుగా వదుల్తున్నావ్ కదూ..! కొన్ని రేఖలుగా మనలని మనమే విభజించుకొని నేను ఇస్లాం పేటలో నువ్వు వరంగల్లు బీటు బజార్లో ప్రజాశక్తి పత్రికా కాపీలుగా గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాం ఇరుకు అరల్లో దాచుకున్న దేహాన్ని నడీ రోడ్డుపై వెచ్చని సూర్యుని సాక్షిగా ఆరబెట్టుకుంటూ ఎర్రని వెలుగులని గాల్లోకెగరెస్తూ నిన్ను స్వప్నిస్తూనే ఉన్నాను నేనూనూ.. ఇప్పుడు మనం రెండు రాష్ట్రాలం రెండు ప్రాంతాలం కానీ ఏక శరీరులం సాయిబూ ...! ఒక్కసారి నిన్ను నిలువెల్లా కౌగిలించుకోవాలనుంది నీతో కలిసి కొన్ని గీతాలని పాడుకోవాలనుంది మరిన్ని సుందర దృశ్యాలని జీవితానికతికించాలనుంది.. హ..! మెరే దోస్త్ చాహూంగ మై తుజే సాంజ్ సవేరే... రెండు గదుల నీ కార్ఖానాలో ప్రవహించే వెచ్చని చాయ్ లో మునకేస్తూ వేళ్ళ మద్య కొన్ని క్షణాలని వెలిగించి గాల్లో వలయాలు గా కమ్ముకోవాలనుంది.. నాకిప్పుడు నిలువెత్తు ఆకుపచ్చని విప్లవ కారున్ని చూడాలనుంది... 04/06/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kCgABD
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kCgABD
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి