కుప్పిలి పద్మ । నిరీక్షణ వొక వైపే!!! ...................................... నేనేమైనా అంటే నువ్వు నవ్వుతావ్... అసంఖ్యాకమైన మాటలు విన్న తరువాత కూడా నువ్వు నవ్వుతావ్... నవ్వీ 'అవి నాకు శబ్ధాలు మాత్రమే' అని తిరిగి నవ్వుతావ్. సందేహం, నువ్వుచ్చే సమయం యెందుకు చెప్పావ్! . ఆశ్యర్యం, అసలు నాకోసం యెదురు చూస్తూచూస్తూ నువ్వెప్పుడు యీ నిరీక్షణని నా చూపులకి అద్దేవ్! రాత్రులకి రాత్రులు నీ కోసం యెదురు చూస్తూచూస్తూ యిన్సొమ్నియాని అల్లుకొన్నానో తనే పెనవేసుకొందో అప్రయత్నంగా మేల్కొనే యెదురు చూపు. యెన్నెన్నో సుదీర్గ దినాల యెదురు చూపు మాటున యెప్పుడో రవ్వంత నవ్వు పనుందంటూ అదృశ్యం... సరసరా పాకే మోహపు దిగులు. ఆ పుష్యమాసపు రాత్రి పల్చని నిద్ర... చలింకా వీడని ఆ వుదయం కాసింత పొగ మంచు పాల ప్యాకెట్, దిన పత్రికల కోసం వీధి తలుపు తెరిచేసరికి యింటి ముందు యెంతో యిష్టంగా పెంచుకొన్న పసుపచ్చని చామంతి పువ్వులు నడుమ ముక్కలుముక్కలై తెల్లని కాగితాలపై నీ కవిత్వం నల్లనల్లని అక్షరాలక్షరాలుగా చెల్లాచెదురై మరోసారి మనం గాయపడ్డాం!!! 4-6-2014
by Kuppili Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBOKFF
Posted by Katta
by Kuppili Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBOKFF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి