పక్షి ఎగిరిపోయింది నువ్వేఎగురుకుంటూవచ్చి నాముందు వాలావో నేనే నీముందు వాలానో ఈ చెట్టుకింద చేరి చాలా కాలం విత్తనాల్ని పొడుచుకొని పొడుచుకొని తిన్నాం ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని నేర్చుకున్నాం పేర్చుకున్నాం స్నేహించుకున్నాం నువ్వలా ఎగిరిపోవడానికి కారణం తెలిసినా గమ్యం చేరకుండానే నిష్క్రమించడాన్ని గురించే దిగులంతా కలపాల్సిన రంగుల్ని డబ్బాల్లోనే వదిలేసి కాన్వాసును ఖాళీగా మిగల్చడాన్ని గురించే ప్రశ్నంతా ఇవాళ నువ్వేసిన అడుగుకు రేపు మరికొన్ని అడుగులు జతపడే సమయాన పాదముద్రలు లేకపోవడమే విచారమంతా మహావృక్షమంత విస్తరించాల్సిన నువ్వు ముడుచుకుపోయిన వైనాన్ని తెల్ల కాగితం మధ్యలో ఆగిపోయిన అక్షరాల్ని తెరచి ఉంచిన కలాన్ని కళ్లనుండి తీసిన అద్దాల్ని నీ అదృశ్యానంతర దృశ్యాల్ని చిప్పిల్లిన కళ్లతో వీక్షిస్తున్నాను బహుశ నువ్వు లేనప్పుడు నీ దేహం మీద పరుచుకున్న వస్త్రాన్ని గద్గద స్వరంతో నీ ఉనికి గురించి అవి ప్రశ్నించే ఉంటాయి నీ దిగిలు కళ్ల ప్రశ్నా ముఖం ఎదురుగా నిలబడి రేపటి గురించి నన్ను నిలదీస్తూనే ఉంది పొదవుకునే చేతుల్ని చాచడం మినహా నేనేం చేయగలను.
by Bandla Madhava Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kKsV1G
Posted by Katta
by Bandla Madhava Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kKsV1G
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి