తొవ్వ .................................అన్నవరం దేవేందర్ వాగు ...ఇదొక సాహిత్య ప్రవాహ.....మాస పత్రిక కరీంనగర్ నుంచి ఈ కాలం లో 'వాగు ' సాహిత్య మాస ప్రత్రిక పురుడు పోసుకుంది .తెలంగాణా అవతరణ రోజే ఈ పత్రిక ఆవిష్క్రిన అయ్యింది .స్వాతంత్ర్య సమార యోధుడు ,నలబై ఏండ్ల కింద 'సారస్వత జ్యోతి ' పత్రిక నడిపిన బోయినపల్లి వెంకట రామా రావు దీనిని ఆవిష్కరించిండ్రు .దీనికి బహుభాషావేత్త ,కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార ప్రకటిత నలిమెల భాస్కర్ సంపాదకులుగా ఉన్నారు ,నగునూరి శేఖర్ వెన్నుదన్ను గా నిలిచారు .జూకంటి జగన్నాధం ,పెద్దింటి అశోక్ కుమార్ యం .నారాయణ శర్మ ,నేను అంటే అన్నవరం దేవేందర్ ,కందుకూరి అంజయ్య ,గాజోజు నాగాభూ షణం,బూర్ల వెంకటేశ్వర్లు ..సంపాదక సభ్యులుగా పనిచేస్తున్నాం . సాహిత్యానికి ఎన్నో పత్రికలు వస్తున్నయి.అందులో ఇదొకటి కాకుండా సామాజిక సాంస్కృతిక రాజకీయ అవగాహన తో తెద్దాం అనుకుంటున్నాం .కథ ,కవిత్వం వ్యాసం విమర్శ అన్నీ ఉంటాయి ఆవిష్కరణ కరీంనగర్ ప్రెస్ భవన్ లో జరిగింది .సూరేపల్లి సుజాత జూకంటి సందేశాలు ఇచ్చిండ్రు . గతం లో కరీంనగర్ లో 'విద్యుల్లత ' పత్రికను బి .విజయ కుమార్ ,గోపు లింగా రెడ్డి ,వి వెంకటరెడ్డి లు వేలువరించిండ్రు ,సత్యార్తి పత్రిక మలయశ్రీ తీసిండు ,సిరిసిల్ల నుంచి జూకంటి నిజాం వెంకటేశం కలిసి ఒక సాహిత్య బులిటెన్ తెచ్చిండ్రు .అట్లనే ఇదొక ఒరవడి తో ఇక్కన్నుచే వాగు ప్రవహిస్తున్నది . రచనలు పంపొచ్చు........................... ;vaagu2014@gmail.com పత్రిక కావలిసిన వాళ్ళు తమ అడ్రస్ ఇస్తే పంపిస్తాం ...మెయిల్ చేయొచ్చు .. జయహో తెలంగాణ .....జయహో వాగు
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRRh9S
Posted by Katta
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRRh9S
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి