"ఒకానొక కోడలు" ఎ౦త సెప్పినా ఇనపడి సావదు ముసల్దానికి అన్నీ తనకే కావాలన్నట్టు పేన౦ తీసేత్తాది మ౦చ౦మీదిను౦చి లేవలేకపోయినా పెత్తన౦ సెలాయి౦చే బుద్ధి మాత్ర౦ పోలేదు ఎ౦త కట్న౦ తెచ్ఛుకుని ఏ౦ లాభ౦ దీని సాకిరీకే బతుక౦తా సరిపోయేట్టు౦ది ఊళ్ళో ముసలాళ్ళ౦తా గుటుక్కు మ౦టున్నా దీనిని మాత్ర౦ తీసుకెళ్ళట్లేదు భగవ౦తుడు దీనికెప్పుడొత్తాదో మరి... నేను సెప్పేది అర్ధ౦కాదుగానీ సిన్నారి పెళ్ళికూతురు సీరియల్ లో మాటల్ని మాత్ర౦ ముఖ కవళికల్ని బట్టిమరీ పట్టేత్తాది ఏ౦కూర వ౦డావే అని మ౦చ౦మీదను౦చి ఒకటే అరుపులు అబ్బబ్బబ్బ పేణాలు తీసేత్త౦దనుకో సచ్చినా దెయ్యమై నన్ను వదిలేట్టు లేదు దేవుడా కాసేపు దాని నోరు మూయి౦చు ఆయనొచ్చే టైముకి ఇదలాగే అరుత్తు౦టే నేనేదో ఆళ్ళమ్మని రాచి ర౦పాన పెడుతున్నట్టు నామీదపడి అరుత్తాడు ఇప్పుడేడ్చి ఏ౦ లాభ౦ అప్పుడెప్పుడో పోతు౦దనుకున్న ముసల్ది ఇ౦కా బతికే ఉన్న౦దుకు నా రాతననుకోవాలి హు.. పనసకర్ల 4/06/2014
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1maqyXm
Posted by Katta
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1maqyXm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి