|| ఉ ద య కా ర్తీ కం || మహేశ్వరి గోల్డి అమర ప్రణవ వాహిని అలలు తాకిన కృష్ణవేణి కాలి అందియలు మౌన పంజరాన ఓ హిమ ప్రతిమ పదముల పసిడి కిరణాలుగా సంతరించుకుని కొలువు తీరిన .....!! వెన్నెల సాయంత్రాలు శ్రావణ సమీరాలు మహాకృతిలో .....!! శ్రావ్యంగా ఒదిగి లిఖిస్తున్న సుస్వర పదములు .....!! ఓ జాహ్నవి శృతిలో పరిణితి చెంది భావావేశపు గమకములుగా మారి ఆలపిస్తున్న అజంతా శిలలపై హిందోళ రాగాలు భానుమతి లతలపై ఉదయ పరిభాషా కుసుమాల సాక్షిగా .....!! హృద్యంగా అమరిన మరపురాని కవితా భాష్యపు స్వర హాసిని తెమ్మెరల పై సౌగంధికా సుమగంధములు వెదజల్లుతూ .....!! మన ప్రేమ సౌధము ....!! సమతాకాంతుల మమతలుగా వెల్లివిరియాలని యుగయుగాలుగా నీ ఆనతికై వేల తారల సమక్షంలో ........... అపూర్వ భ్రమరములయి భ్రమసి చూస్తున్నవి ఓ సుమనోహరా...!! 04/06/2014
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l57HQF
Posted by Katta
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l57HQF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి