తమలపాకు పాదాలపై తుమ్మెదలా చూపులన్ని వాలుతూనే ఉన్నవి మనసులోని మాటలన్ని గట్టుతెగిన ఏరులాగే ఉరుకుతూనే ఉన్నవి మొలకెత్తిన జ్ఙాపకాల కంటితేమ మంచులాగ గడ్డకట్టి భద్రంగా దాచుకున్న చందమామ నవ్వులన్ని వెన్నలాగ కరుగుతూనే ఉన్నవి తనసిగలో చీకట్లను తురుముకున్న రాత్రికన్య నుదుటిపైని జాబిల్లి చేయిచాచి సాగరాలు మనసులోని ఆశలాగ పిలుస్తూనే ఉన్నవి ప్రాణాలను బలిపెడుతూ ఎగురుతున్న పురుగులనే తదేకంగ చూస్తున్న గుండెల్లో పొగచూరిన దివ్వెలన్నీ అసూయతో కాలుతూనే ఉన్నవి చెట్టుకింద కూలబడిన నీడలాగ నడుంవిరిగి నినాదాలు కూర్చున్నా ఎగరలేక పాకుతున్న ఏరులన్నీ కన్నీళ్ళను కార్చుతూనె ఉన్నవి నానావిధ ఫిర్యాదుల గుట్టల్లో మేనుమరిచి నిదురిస్తూ హాయిగా తోటలోని పిట్టలన్ని గుట్టుగానె బతుకుబండి నెట్టుతూనె ఉన్నవి చలిగాలి విసనకర్ర చేతబట్టి మల్లెపొదల వేడిసెగల నార్పినా మట్టిలోన సువాసనల చినుకులేవొ రగులుతూనె ఉన్నవి
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kzkOdo
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kzkOdo
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి