ఎక్కడికో సుదూరంగా రోజంతా తరలి పోతున్నపుడు . . . సంధ్యా సుందరి సడి సేయకుండా వచ్చి మేను దోచుకునే వేళ . . నా ఊహల ముంగిట్లో ఎవరో స్వప్నాల దీపం వెలిగించారు . . ! ఎగిసి పడే శ్వాస ఎద నింపే వేళ . . దిగులు గడపకు చేరగిలి కనులు చెమ్మగిలే వేళ . . దోబూచులాడుతూ ప్రేమతో తడుతూ కనులకేమో కానరాకనే . . . మదిని తాకారెవరో . . . ! ! ఏ మలుపులోనూ ఈ మనసులు కలిసే ఆశే లేదు. . ఐనా ఎక్కడి నుండి ఉబికి వచ్చాయో ఈ జన్మ జన్మల బంధాలు . . ? తీయని సందిగ్ధంతో మనసు నిండుకున్న ఆర్తి నాదే ఐనా . . ఆలపిస్తున్న ఆవేదన మరొకరిది. . ! ! ( ముఖేష్ గారి.. కహీ దూర్ . . జబ్ దిన్ డల్ జాయె.. పాటకు అనువాదం.. ) నిర్మలారాణి తోట [ తేది: 12.02.2014 ]
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAQZY0
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAQZY0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి