పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Abd Wahed కవిత

నీడలు... నీడల ఊచల వెనుక నగరం రాత్రిజైలుకు తరలుతోంది ఊహల సంకెళ్ళతో మౌనం పెనుగులాడుతోంది గాలి తెరల మేలి ముసుగులో కరిమబ్బుల కురుల మాటున ప్రేయసి చెంపలా నెలవంక నా వెంటే నడుస్తోంది... కూలిపోయిన వంతెనలా గడిచిపోయిన కాలం ... గడియారం ముల్లుపై గులాబీ ప్రాణాయామం ... ప్రవహిస్తున్న నిశ్శబ్ధంలో సంగీతం మూగబోయింది అలజడి రేపే గులకరాయిలా ఒక కల రాలిపడుతుందా? దిగులు పొగల చీకటి నేలపై హరివిల్లులా పరచుకుంటున్న జ్ఙాపకం కనురెప్పలపై వాలుతున్న మిణుగురులు జీవితం కొత్త ప్రాణం పోసుకుంటుంది... చిరునవ్వులు ఆరిపోతే కనుచూపులు కొడిగడతాయి నీడలనే వెలిగిస్తే కొత్త కాంతి పరచుకుంటుంది.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1olkE9T

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి