!!ప్రేమించిన మనస్సు -6!! !!ప్రేమంటే!! యదను తొలిచావు మదిని గెలిచావు అదే ప్రేమన్నావు. మాటల గారడీ చేశావు నన్ను నీ ప్రేమలో ముంచావు. ప్రేమ కాంతులు కాంతులీనుతుంటే కన్నవారి కలలు కనుమరుగౌతున్నా కాలం నన్ను నీ తోడులోనే నడిపించింది ప్రేమ వలపులో నన్ను వంచించావో లేక బందించావా? నన్ను నీవుగా మార్చేశావు. నాకంటు ఏమీలేదు నువ్వు తప్ప అనేటట్టు చేశావు. ప్రేమ మేఘానివి నీవై నాపై ప్రేమ వర్షం కురిపించావు ప్రేమగ నీ చేతులతో తాకావు నీ ప్రేమ స్వరమే మందుగా ఇచ్చావు నేనంటే ప్రాణం అన్నావు నా ప్రాణమే నీవుగా మారావు నా కలల వాకిట్లో నీ ప్రేమను కల్లాపుగా చల్లావు నీవే అందులో అందమైన ముగ్గుగా మారావు. ప్రేమ అనే రెండు అక్షరాలను రెండు హ్రుదయాలు అన్నావు (నేను నువ్వు) ఒకే పదంగా మార్చావు. నేను అనే దానికి నువ్వును జత కలిపి ప్రేమ అన్నావు. యదను తొలిచావు మదిని గెలిచావు. !!అజయ్!! 12FEB2014.
by Ajay Pandu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bo89Ya
Posted by Katta
by Ajay Pandu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bo89Ya
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి