బొండు మల్లె చెట్టు ****************** మా ఊరు ఒకనాడు పట్నం కాక మునుపు బశిస్టాండ్ల ఉండేది బొండు మల్లె చెట్టు ! ఒచ్చి పోఎకాడ మనసార పలకరించి పూ అచ్చింతలు జల్లేది ! తలెత్తి చూస్తె పూలగుత్తులు చిక్క చిక్కగా పచ్చని గుంపున తెల్లని మొగ్గలు ఇప్పుకొని నవ్వేటివి ! ఇంతవుండి మేమంతా కొమ్మ ఒంపి తెంపగోరి ఎక్కవోతే చిన్నగుండునా ఆ చెట్టు ! రాలే పూలను ఏరి ఆడుతుండే మత్తున ! కాడకు కాడను మలచి అల్లితే అయితుండె దారంలేని దేవుని దండ ! కాడను ఒత్తి పీ పీ అని పీపలూదేది తీపి గుంచి చేదు పీల్చి రెండుగలిపి మింగితిమి అప్పుడే నేర్పింది బతుకు పాఠం ! గురుతుకొచ్చి కాలవట్టే మనసునింత సూద్దమంటె కానరాదు కళ్ళనిండా ! కృష్ణ మణి I 12-02-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0Y5DE
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0Y5DE
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి