_ కట్టు కథ _ ఇంకా పుట్టలేదు మళ్ళీ!! ఎవడో వాడి నరాల కూడలిని మాయగతం చేస్కుని ప్రాణాన్ని శాస్త్రపరిచి దేహానికి వాస్తు కట్టి , ఒకడి కణాల్లో అణువై కొలువై వెలువడుతానని జోస్యం రాసి కట్టకట్టి కంచిలో పెడితే కాళ్ళీడ్చుకుంటూ పొయ్యి ఊరు , పేరు , తీరు , తెన్నూ తెలుసుకొని తెల్లమొహమేసి అగస్త్యాగత్యావస్తల తాటాకు చప్పుల్లిని నాకు నేనో నోస్ట్రడమసయ్యి ఏం పీక్కోలేక , right రంగుల్లోతుల్లో wrong ఏదో కనిపించి ఆ wrong కూడా righటేనని పగటి రంగులకి ముసుగేసే చీకటి చెబుతుంటే, మళ్ళీ పుట్టానప్పుడే నాడి జోస్యాలకతీతంగా!! నాnnaaa, ఎప్పుడు పుట్టితీవనడిగే నాదుడెవడు!! maternity hospital నుంచి municipal office దాకా elementary స్కూల్ నుంచి ఇప్పటిదాకా ఇప్పట్నుంచి ఎప్పటిదాకో ఏమో నా పుట్టుక్కో లెక్కని పక్కాగా చెక్కేశారు!! తిక్కలేసి మళ్ళీ పుట్టినట్టు పొయ్యి లెక్కమార్చమంటే చుక్కలు చూపించి లెక్కెట్టుకోమంటున్నారు!! colours అన్నీ colour tvల్లోనో , వెండి తెరల్లోనో పుట్టాయనుకునే అప్రకృతిక స్త్రీ పురుష మేధో సంపర్క భావ నిర్దారణలతో, శాస్త్రాలకతీతమైన సర్వ రూపదారణాన్నిసందిగ్ధంలో పడేసి సంత చేసి గతమవ్వక , అవగతమవ్వక , అనన్యమై , అగమ్యమై ఇందులోనిదై ఇదై ఏదో ఉంటోందనంటే, ఇక్కడుండలేం బాబయ్యా!! అవును!! దేవుడున్నాడు.. నమ్ము, నమ్మకపోతే సావ్ కాలముంది..గతమో లోకం , ప్రస్తుతమో లోకం ,భవిష్యత్తో లోకం లోకానికుందో లేదో.. దాని మైకంలోని మన్నామనుషులకుంది!! ఎగేసి దిగేసి తెగేసి రాలే ప్రాణులకు లేనివెన్నో వాటిని ప్రాణులనే జ్ఞానులకున్నాయి!! నమ్మకం మీద నమ్మకం లేకపోతే నరకానికి పోతావ్!! నరకం గురించి అడక్కు!! ఏ జ్ఞానో చచ్చో చెడో వెళ్ళొచ్చి చెప్పాడు.So, నమ్మంతే!! నమ్మటానికే జన్మ, దీనెమ్మా అమ్మ గురించి అడక్కు!! ఆశ, పాశం అని ఆవేశంలో ఆడదని మర్చిపోతుంది నమ్మంతే !! అమ్మకైనా ఆస్తే అమ్మ!!లేదంటే అమ్మ లేదు ఆడతనమే పెట్టుబడై అమ్మరికం అమ్మకానికి అంకితమే!! Noooooooo అంటారు ..So, నమ్మకు నమ్మకపోయినా నిజమే ఇది!! ఆడ మగలకు పుట్టినా , అది పుట్టినట్టు కాకుండా పుట్టగతుల్లేకుండా ఇంకోసారి పుట్టినట్టన్పిస్తే మాత్రం నిజానికి , నమ్మకానికి భేదం చెదిరిపోయి అవి రెండూ లేక , ఒకటవ్వక శోకం చచ్చి లోకముదురై మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండొచ్చు చచ్చేదాకా!! ______________________________________Chi Chi( 12/2/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m4fL6r
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m4fL6r
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి