జీవిత ప్రయాణం ఈ రైలు ప్రయాణం లా హాయిగా సాగిపోతే ఎంత బాగుండు..? ఎదురు సీట్లో బొద్దబ్బాయ్.. ఎదురింట్లోని బొజ్జంకుల్ లాగా..!! కిటికీ పక్కన అమ్మాయి.. మా పక్కింటి 'రూప ' లాగ..!! ఎదురుగా ఫోన్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఓ నడి ఈడు ముసుగు వీరుడు..!! ఎర్రచీర కట్టుకున్న అంటీ నల్ల చింతపండులా...!! అరె.. ఎన్నడూ ఒంగడానికి ఒప్పుకోని యువకులు కింద.. అందరూ నడిచే బాటలో...!! జబ్బకు బ్యాగు తగిలించుకున్న ఉద్యోగి.. బహుశా మచిలీపట్నానికనుకుంటా..!! భేషజాలు మర్చిపోయిన మనుషులు ఒకే జనరల్ భోగీలో ప్రయాణం.. నో రిజర్వేషన్స్ ప్లీజ్..!!!
by Navee Naveen Kumar Gadari
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1AJgZ
Posted by Katta
by Navee Naveen Kumar Gadari
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1AJgZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి