పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్/ మిగలని దేహం --------------------­-------- ఈ రోజేంటో కాస్త దిగులుగానే ఉంది నిన్న నా శరీరం గడిపిన తీరువల్లేమో గూటి నుండి కిందపడి చితికిన గుడ్లు నా ముందంతా పరుచుకున్నాయి వాటిలో కొన్ని పక్షి పిల్లలు పొదిగినవి ఇంకా కళ్ళుతెరవనివీను నేనుకూడా అలానే పడ్డట్టుగా మంచుగుహల్లో నా దేహం కాలుతున్నట్టుగా ఇప్పుడేం చేయను ఒళ్ళంతా బిగదీసుకుని కూర్చోవడమే ఇక మిగిలింది చర్మమంతా అప్పుడే దులిపిన తెరలాగా ఉగిసలాడుతోంది రాలిపడే ఆకులు అంగాల కొమ్మలో నిన్ను చేరాననే తృప్తిని స్వప్నిస్తుంటే కళ్ళనిండా రాలుతున్న మట్టి చెదలు సంద్రమంతా కన్నీరైనట్టునూ నాపైనుంచి ఎగిరిపడుతుంటాయి నా ముందే మళ్ళీ నాలో మిగిలిన కొద్ది గాలిని శక్తిగా కూడగట్టుకొని లేచాను నిన్ను కలుద్దామని... ఇప్పుడిక్కడ ఖాళీమాత్రమే మిగిలింది. తిలక్ బొమ్మరాజు 12.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBo345

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి