పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

ఐ లవ్ మై ఫేస్బుక్..! --------------------- నా ఫేస్బుక్.. నాకు ఇదో మూగ పుస్తకం.. ఒక్క క్షణం నోరాగదు మరీ.. నాకు ఇదో చెవిటి పుస్తకం.. అందరి వాగుళ్ళు వినేస్తుంది.. నాకు ఇదో గుడ్డి పుస్తకం.. ఏది పడితే అది చూడకుండానే చూపించేస్తుంది.. నాకు ఇదో దేవాలయం.. ఆ దేవుడ్ని ఎలా ప్రసన్నం చేస్కోవాలో ప్రశాంతంగా నాకు చెప్తోంది.. నాకు ఇదో విద్యాలయం.. నాకు తెలియని లెక్కలేనన్ని విషయాలని నాకు నేర్పిస్తోంది.. నాకు ఇదో పర్ణశాల, జరిగిన కథలను బొమ్మలుచేసి కళ్ళకు కట్టినట్లు చుపిస్తది.. నాకు ఇదో మాయాజాలం, లేని వాటిని కూడా ఉన్నట్లు బ్రమ కలిగిస్తుంది.. నాకు ఇదో మార్గదర్శకురాలు.. ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకొమ్మని సలహాలు ఇస్తూనే ఉంటుంది.. నేనో మొండోండ్నని తెలిసినా నా మంచికోరే మంచి మనుషులను దగ్గరకు తెచ్చిపెడుతుంది.. నాకు ఇదో అలారం.. ఎప్పటికప్పుడు నేను చెయ్యాల్సిన భాద్యతలను గుర్తు చేస్తునే ఉంటుంది.. నాకిదో ఊతం.. నాకు పట్టు జారుతున్నప్పుడు పట్టుకుని నడిపిస్తుంది.. చాలా మందికిదొ అఘాతం.. ఎందరినో పతనానికి తొక్కేస్తోంది.. అయినా నేనంటే ఎంత ప్రేమో.. నాకు మాత్రం ఎప్పుడూ ఒక ప్రేయసిలా తోడూ నీడై తన ప్రియుడిని లోకం ముందు గొప్పగా చూపించాలనుకునే ప్రియురాలై ప్రతిక్షణం తాపత్రయ పడుతూనే ఉంటుంది. ఐ లవ్ మై ఫేస్బుక్..! - సాట్నా సత్యం, 12-02-2014, 14:40

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dH3A5w

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి